ETV Bharat / state

'పది పరీక్షల నిర్వహణలో ఏ లోటూ రానివ్వం' - హైకోర్టు

పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర విద్యా శాఖ నివేదించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపింది. కంటైన్​మెంట్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు లేవని పేర్కొంది. ప్రతీ పరీక్ష కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమిస్తున్నట్లు వివరించింది. విద్యార్థులకు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద, హోమియో ఔషధాల కోసం ఆయుష్ విభాగాన్ని కోరినట్లు నివేదించింది.

education department submits report to high court
పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
author img

By

Published : Jun 4, 2020, 4:38 PM IST

Updated : Jun 4, 2020, 5:29 PM IST

ఈనెల 8 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. జిల్లాల వారీగా పరీక్షల ఏర్పాట్లను వివరిస్తూ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఒక్కో పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధి ఉండేలా ఈనెల 8 నుంచి జులై 5 వరకు షెడ్యూల్​ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సరైన వెంటిలేషన్, విద్యుత్, మంచినీరు, ఫర్నీచర్ వంటి వసతులు ఉన్న భవనాల్లోనే పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు నివేదికలో వెల్లడించింది. కంటైన్ మెంట్ ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు లేవని తెలిపింది. గతంలో ఉన్న 2 వేల 530 పరీక్ష కేంద్రాలను 4 వేల 535కి పెంచినట్లు నివేదించింది.

కొత్త హాల్​టికెట్లు జారీ చేయడం లేదు..

విద్యార్థులకు కొత్త హాల్ టికెట్లు జారీ చేయడం లేదని విద్యా శాఖ వివరించింది. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థుల తల్లిదండ్రుల మొబైల్​కు ఎస్ఎంఎస్ ద్వారా పంపించామని.. ప్రధానోపాధ్యాయులు, విద్యా శాఖ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేసినట్లు విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్ర రామచంద్రన్ వెల్లడించారు. ఒక్కో విద్యార్థి మధ్య ఐదారు అడుగుల దూరం ఉండేలా.. బెంచీకి ఒకరే కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

వైద్య సిబ్బందిని నియమించాం..

కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ల ద్వారా థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లౌజులు సేకరించి.. పరీక్ష కేంద్రాలకు తరలించినట్లు విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. ప్రతీ పరీక్ష కేంద్రానికి ఒకరు చొప్పున 4 వేల 535 మంది వైద్య సిబ్బందిని నియమించినట్లు పేర్కొంది. పిటిషనర్ సూచనల మేరకు విద్యార్థులు, సిబ్బందిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద, హోమియో ఔషధాలు సరఫరా చేయాలని ఆయుష్ విభాగాన్ని కోరినట్లు విద్యాశాఖ హైకోర్టుకు తెలిపింది. పరీక్షకు ముందు, తర్వాత కేంద్రాలు, వాటి ఆవరణలో క్రిమిసంహారక మందులు చల్లుతామన్నారు.

విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

జీహెచ్ఎంసీ పరిధిలో పదో తరగతి విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు పునరుద్దరించడంతో పాటు.. ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు ఎత్తివేసిందని తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రుల్ల అనుమానాలు, అయోమయాన్ని తొలగించేందుకు జిల్లా విద్యాధికారి కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం కల్పిస్తున్నామని విద్యా శాఖ వెల్లడించింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజేషన్ వంటి కరోనా నివారణ జాగ్రత్తలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించినట్లు నివేదికలో చిత్ర రామచంద్రన్ వివరించారు. పదోతరగతి పరీక్షలపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది.

ఇవీ చూడండి: కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..!

Last Updated : Jun 4, 2020, 5:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.