Delhi Liquor Scam Latest Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును ప్రశ్నించేందుకు దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుచ్చిబాబును ప్రశ్నించేందుకు సిద్ధమైంది. అనంతరం దిల్లీ మద్యం కేసులో బుచ్చిబాబు వాంగ్మూలం ఈడీ నమోదు చేయనుంది.
MLC Kavitha's Ex Auditor arrested in Delhi liquor policy : ఇటీవలే దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. దిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహారించారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు బుచ్చిబాబును ప్రశ్నించి అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చారు.
MLC Kavitha name in ED charge sheet: అదేవిధంగా దిల్లీ లిక్కర్ స్కామ్ అనుబంధ ఛార్జిషీట్లో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. పంజాబ్, గోవా ఎన్నికల ప్రచారం నిధుల కోసమే.. ఆప్ నేతలు మద్యం కుంభకోణానికి తెరలేపినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఆప్ మీడియా వ్యవహారాల ఇంఛార్జి విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడని ఈ వెల్లడించింది.
దిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ దర్యాప్తు ఈ విధంగా జరుగుతుండగా.. వారం రోజుల క్రితం నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. సౌత్ గ్రూప్‌లోని కీలక నిందితులయిన సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ల బెయిల్ పిటిషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ కేసులో కొత్తగా అరెస్టు అయిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు కొనసాగుతుందన్న ఈడీ.. సౌత్ గ్రూప్ నిందితులకు బెయిల్ వస్తే ఈ కేసులో భాగంగా ఉన్న ఇతర సాక్షులను, కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. దాంతో సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది.
ఇవీ చదవండి: