Delhi liquor scamదిల్లీ మద్యం ముడుపుల కేసులో జరుగుతున్న అరెస్టులు... రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో దిల్లీ మద్యం కుంభకోణంలో మరోసారి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. దిల్లీలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన ఈడీ.. మద్యం వ్యాపారులకు సంబంధించిన ప్రదేశాల్లో సోదాలు చేస్తోంది. ఇప్పటికే స్కాంలో సీబీఐ సోదాలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అభిషేక్ బోయినపల్లిని అరెస్టు చేసింది.
అభిషేక్‌కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కస్టడీని పొడిగించింది. మరో రెండు రోజుల పాటు విచారించేందుకు సీబీఐ అనుమతి కోరగా.. కోర్టు అనుమతినిచ్చింది. ఇదే వ్యవహారంలో అరుణ్ రామచంద్ర పిళ్లైకి నోటీసులు ఇచ్చినట్లు సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది. మరికొన్ని ఆధారాలు, పత్రాలు పరిశీలించాల్సి ఉందన్న దర్యాప్తు సంస్థ.. ఇదే కేసులో ముత్తా గౌతమ్‌ను విచారణ చేస్తున్నామని వివరించింది. అరుణ్ రామచంద్ర పిళ్లైకి గౌతమ్‌తో ఉన్న సంబంధాలపై విచారించేందుకు రెండు రోజుల కస్టడీ పొడిగించాలని విజ్ఞప్తి చేసింది.
ఇవీ చూడండి..
దిల్లీ లిక్కర్ స్కామ్.. అభిషేక్ అరెస్టు.. నెక్ట్స్ ఆ ప్రముఖులకే నోటీసులు!
Delhi liquor scam: అభిషేక్ బోయినపల్లికి 3రోజుల రిమాండ్.. ఇక నెక్ట్స్ వారే!