ETV Bharat / state

'గ్రానైట్‌ కంపెనీల్లో అక్రమ లావాదేవీలు గుర్తించి రూ.1.08 కోట్లు స్వాధీనం చేసుకున్నాం' - ED raids on granite companies are latest news

ED Raids in Telangana Updates: రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసిన రాష్ట్రంలోని గ్రానైట్‌ కంపెనీల్లో సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ స్పష్టతనిచ్చింది. రాష్ట్ర విజిలెన్స్ శాఖ నివేదిక ప్రకారం గ్రానైట్ కంపెనీలు చేసిన ఎగుమతులకు, చెల్లించిన రాయల్టీకి భారీగా తేడాలున్నాయని.. దీని ఆధారంగా ఈసీఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకొని పలు బినామీ బ్యాంకు ఖాతాలను గుర్తించినట్లు వెల్లడించారు. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ ప్రకటన విడుదల చేసింది.

ED raids in telangana
ED raids in telangana
author img

By

Published : Nov 11, 2022, 12:12 PM IST

Updated : Nov 11, 2022, 7:56 PM IST

ED Raids in Telangana Updates: హైదరాబాద్, కరీంనగర్‌లలోని పలు గ్రానైట్స్ కంపెనీల కార్యాలయాలు, యజమానుల ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ.కోటీ 8 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అంతేకాకుండా పదేళ్లకు సంబంధించిన లావాదేవీల రికార్డులను స్వాధీనం చేసుకున్నామని.. సోదాల సందర్భంగా పలు బినామీ బ్యాంకు ఖాతాలను గుర్తించామని ఈడీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 9,10 తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్‌లలోని శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, ఎస్వీజీ ప్రైవేట్ లిమిటెడ్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్‌, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్‌తో పాటు వాటి అనుబంధ సంస్థల్లో సోదాలు నిర్వహించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. రాష్ట్ర విజిలెన్స్ శాఖ నివేదిక ప్రకారం ఈ గ్రానైట్ కంపెనీలు చేసిన ఎగుమతులకు, చెల్లించిన రాయల్టీకి భారీగా తేడాలున్నాయని.. దీని ఆధారంగా ఈసీఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

కరీంనగర్ నుంచి వైజాగ్, కాకినాడ మీదుగా ఓడరేవులు, రైలు మార్గాల ద్వారా చైనా, హాంకాంగ్‌కు భారీగా గ్రానైట్‌ ఎగుమతులు చేశారని.. రికార్డుల్లో మాత్రం తక్కువ మొత్తం చూపించారని ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనివల్ల ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుముతో పాటు రాయల్టీ నుంచి తప్పించుకున్నారని అధికారులు తెలిపారు. చైనాకు ఎగుమతి చేయగా వచ్చే నగదును గ్రానైట్ కంపెనీల యజమానులు.. తమ ఉద్యోగుల పేరు మీద తెరిచిన బినామీ ఖాతాల్లో జమ చేయించారని ఈడీ అధికారులు తెలిపారు. ఇలా బ్యాంకు ఖాతాల్లోకి వచ్చిన డబ్బును రుణంగా తీసుకున్నట్లు చెబుతున్న యజమానులు.. దానికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించలేకపోయినట్లు అధికారులు తెలిపారు. చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతాల నుంచి గ్రానైట్ కంపెనీల యజమానుల ఖాతాల్లోకి నగదు బదిలీ అయిందని.. పనామా లీక్స్‌లో లీవెన్ హ్యూ పేరున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల సమాచారం గురించి పనామా లీక్స్ ఓ జాబితా రూపొందించి గతంలో విడుదల చేసింది. గ్రానైట్ కంపెనీలు ఫెమా నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా గుర్తించామని.. దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

మరోవైపు పీఎస్ఆర్ గ్రానైట్స్ యజమాని పాలకుర్తి శ్రీధర్‌ను ఈడీ అధికారులు కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు. అవసరమైనప్పుడు పిలిస్తే మళ్లీ రావాలని సూచించారు. మిగతా గ్రానైట్ కంపెనీల యజమానులను ఈ నెల 18వ తేదీన రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే: రెండు రోజుల క్రితం రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌-ఈడీ, ఆదాయ పన్ను-ఐటీ శాఖ అధికారుల తనిఖీలు జరిగాయి. ఓవైపు దిల్లీ మద్యం కుంభకోణం కేసులో తనిఖీలు, విచారణ కొనసాగుతుండగానే.. తాజాగా కొన్ని గ్రానైట్‌ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయన్న ఆరోపణలతో ఈడీ, ఐటీ శాఖ అధికారులు రాష్ట్రంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

కరీంనగర్‌లోని 9 గ్రానైట్ సంస్థలు అక్రమాలకు పాల్పడ్డాయని పేరాల శేఖర్‌ రావు.. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఎన్​జీటీ, కేంద్ర పర్యావరణశాఖకు... గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలను దర్యాప్తు సంస్థలకు అందించారు. అదే విషయంపై 2019లో బండి సంజయ్‌ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఆ రెండు ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈడీ, ఐటీ శాఖ అధికారులు 20 బృందాలుగా విడిపోయి హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మంలోని గ్రానైట్‌ సంస్థల యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్‌ సోమాజీగూడలోని.. పీఎస్​ఆర్ గ్రానైట్స్ కార్యాలయం, హైదర్‌గూడ ఉప్పరపల్లిలోని.. ఎస్​వీజీ గ్రానైట్స్ అధినేత ఇళ్లు, కార్యాలయంలో సోదాలు చేశారు.

ఇవీ చదవండి: రెండో రోజూ గ్రానైట్‌ కంపెనీలపై ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం..!

మంత్రి గంగుల ఇంట్లో ఈడీ సోదాలు.. తాళాలు పగులగొట్టించి మరీ!

మూత్రపిండంలో రాళ్లొచ్చాయని ఆస్పత్రికి వెళ్తే..​ కిడ్నీ మాయం!

Last Updated : Nov 11, 2022, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.