ETV Bharat / state

చంచల్​గూడ జైలులో నందకుమార్​ను విచారిస్తున్న ఈడీ అధికారులు - ED officials are interrogating Nandakumar

Nandakumar ED Enquiry : చంచల్‌గూడ జైలులో ఉన్న నందకుమార్​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ, రేపు నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

నందకుమార్
నందకుమార్
author img

By

Published : Dec 26, 2022, 1:24 PM IST

Nandakumar ED Enquiry : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌ను ఈడీ విచారిస్తోంది. హైదరాబాద్ చంచల్​గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నందకుమార్‌ను రెండ్రోజుల పాటు అధికారులు ప్రశ్నించనున్నారు. బంజారాహిల్స్​లోని ఓ భూ వ్యవహరంలో మధ్యవర్తిగా వ్యవహరించిన నందకుమార్.. భూమిని కాజేయాలని యజమానిని వేధింపులకు గురిచేసినట్లు కేసు నమోదైంది. దీని ఆధారంగా మనీలాండరింగ్ యాక్ట్ కింద నిందితుడిపై ఈడీ కేసు నమోదు చేసింది.

ఇందులో భాగంగా విచారించేందుకు అనుమతివ్వాలని నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. అసిస్టెంట్ డైరెక్టర్​తో పాటు మరో ఇద్దరు విచారణ జరిపేందుకు న్యాయస్థానం అంగీకరించింది. కోర్టు అనుమతి మేరకు చంచల్‌గూడ జైలుకు వెళ్లిన ఈడీ అధికారులు.. నందకుమార్‌ను ప్రశ్నిస్తున్నారు. విచారణ కోసం కారాగారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదిలో దర్యాప్తు జరుపుతున్నారు. ఇవాళ, రేపు నందకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ అధికారులు.. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.

ఇవీ చదవండి: గిరిజన హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుల విద్యార్హతల్లో మార్పులు.. ఆందోళనలో ఆ అభ్యర్థులు..!

మహాత్మా గాంధీ సహా మాజీ ప్రధానులకు రాహుల్​ గాంధీ నివాళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.