ED Investigation on Casino Case: క్యాసినో కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ ఈడీ ఎదుట మంత్రి తలసాని వ్యక్తిగత సహాయకుడు హరీశ్‌తో పాటు డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డి, వ్యాపారవేత్త బుచ్చిరెడ్డి హాజరయ్యారు. ఇదే వ్యవహారంలో ప్రమేయమున్న మరికొందరు వ్యాపారులనూ విచారించనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎల్. రమణ, మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. విచారణకు అనంతరం అస్వస్థతకు గురైన ఎమ్మెల్సీ ఎల్.రమణ ఆసుపత్రిలో చేరారు.
ఇప్పటికే తలసాని మహేశ్, ధర్మేంద్ర యాదవ్ విచారణకు హాజరై అధికారులు అడిగిన ప్రశ్నలకు సవివరంగా సమాధానమిచ్చారు. గ్రానైట్ కంపెనీల కేసులోనూ పలువురు యజమానులను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. విదేశాలకు గ్రానైట్ ఎగుమతులు, అవకతవకలపై ఆరా తీయనున్నారు. ఫెమా నిబంధనల ఉల్లంఘనలు, హవాలా నగదు చెల్లింపులపై దర్యాప్తులో నిజానిజాలు నిగ్గుతేల్చనున్నారు.
ఇవీ చదవండి: