రాష్ట్రంలో సంచలనం సృష్టించిన క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి, సంపత్‌లను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు వీరిని ఈడీ అధికారులు విచారించారు. విదేశాల్లో నిర్వహించిన క్యాసినో, ఈవెంట్స్ లావాదేవీలు, పెద్ద మొత్తంలో విదేశీ మారకద్రవ్యం దారి మళ్లించడం, బ్యాంకు ఖాతాల వివరాలు, వంటి అంశాలపై ప్రవీణ్ బృందాన్ని ఈడీ అధికారులు విచారించారు. అయితే విచారణలో ప్రవీణ్ తడబడ్డట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి ప్రవీణ్ బృందాన్ని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరికొంతమంది క్యాసినో ఏజెంట్లతో పాటు ఇంకొందరికి ఈడీ తాఖీదులు జారీ చేయనున్నట్టు సమాచారం.
ఇవీ చూడండి..
Casino: చీకోటి ప్రవీణ్ బృందాన్ని విచారిస్తున్న ఈడీ.. హవాలా లెక్క తేలేనా?
'ద్రవ్యోల్బణం కట్టడి చేస్తున్నాం.. ఆర్థిక సంక్షోభం మాటే లేదు'