Ed Inquiry On Liger Movie Investment: లైగర్ సినిమా పెట్టుబడులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సినిమా నిర్మాణ సమయంలో రూ.10 కోట్లు విదేశాల నుంచి పెట్టుబడుల రూపంలో వచ్చిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే పూరి జగన్నాథ్, ఛార్మికౌర్, విజయ్ దేవరకొండను విచారించింది. పూరి కనెక్ట్ ఎల్‌ఎల్‌ఎల్‌పీకి సంబంధించిన రూ.30-40 కోట్ల ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించినట్లు సమాచారం.
పలు ఖాతాల్లో నుంచి ఈ డబ్బు బదిలీ అయినట్లు గుర్తించిన క్రమంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గతంలో నటించిన సినిమాలకు తీసుకున్న పారితోషికం.. లైగర్ సినిమాకు తీసుకున్న మొత్తం గురించి ఆరా తీస్తోంది. లైగర్ సినిమాకు తక్కువగా తీసుకున్నట్లు గుర్తించినట్లు సమాచారం. అందులో మతలబు గురించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే లైగర్ సినిమా పెట్టుబడులకు రాజకీయ నేతలతో సంబంధముందా అని కూపీ లాగుతోంది.
ఇవీ చదవండి: "మనకొచ్చే పాపులారిటీ వల్ల కూడా కొన్ని సమస్యలొస్తాయి"
విదేశాల్లో జూదం కేసులో ఈడీ వేడి.. పూరి, ఛార్మిలపై ప్రశ్నల వర్షం
TSLPRB: పోలీస్ అభ్యర్థులకు అలర్ట్... అమల్లోకి కొత్త విధానం
ఆ రాష్ట్రంలో 76 శాతానికి రిజర్వేషన్లు.. అసెంబ్లీలో కీలక బిల్లులు పాస్