ED Inquiry on MLA Rohit Reddy : దాదాపు 7 గంటలుగా కొనసాగిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. రోహిత్‌రెడ్డి సమర్పించిన ఆధారాలపై 7 గంటలుగా ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఎమ్మెల్యే వ్యక్తిగత, వ్యాపార వివరాలపై ఆరా తీశారు. రోహిత్‌రెడ్డికి చెందిన ఎవరెస్టు ఇన్‌ఫ్రా కంపెనీ వివరాలు, కుటుంబసభ్యుల బ్యాంకు ఖాతాలు, కంపెనీ లావాదేవీలపై వివరాలు సేకరించారు. 17 బ్యాంక్ ఖాతాలు, 3 లాకర్ల వివరాలను రోహిత్‌రెడ్డి ఈడీ అధికారులకు సమర్పించగా.. అనుమానాస్పద లావాదేవీలపై రోహిత్‌రెడ్డిని ప్రశ్నించారు.
నాటకీయ పరిణామాల మధ్య సోమవారం మధ్యాహ్నం ఈడీ విచారణకు హాజరైన రోహిత్‌రెడ్డిని ఈడీ అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు. పలు వివరాలు సేకరించి.. నేడు మరోసారి విచారణకు రావాలని సూచించారు. ఈడీ కార్యాలయం నుంచి బయటకొచ్చిన తర్వాత రోహిత్‌రెడ్డి మాట్లాడారు. ఈడీ అధికారులు తన వ్యక్తిగత వివరాలు, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. తన వ్యాపార వివరాలు, ఫ్యామిలీ వివరాలు అడిగారని చెప్పారు. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు. ఏ కేసులో నన్ను పిలుస్తున్నారనేది ఈడీ అధికారులు స్పష్టత ఇవ్వలేదన్న ఆయన.. నేడు మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. దర్యాప్తు సంస్థల మీద తనకు గౌరవం ఉందని.. ఉదయం 10:30కు మరోసారి విచారణకు వస్తానని స్పష్టం చేశారు. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్నందున భిక్ష తీసుకున్నాక విచారణకు వెళ్లనున్నారు.
ఇవీ చూడండి..
ముగిసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి తొలిరోజు ఈడీ విచారణ.. 6 గంటల పాటు ప్రశ్నల వర్షం..