రద్దయిన పెద్దనోట్ల మార్పిడి కేసులో రూ.130.57కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ముసద్దీలాల్ నగల దుకాణం బోగస్ రసీదులు సృష్టించిందని ఈడీ పేర్కొంది. బోగస్ రసీదులతో రూ.111 కోట్ల నోట్లు మార్చినట్లు గుర్తించింది.
కైలాష్ చంద్ గుప్తా, ఆయన కుమారుల సలహాతో అక్రమాలు జరిగాయని వెల్లడించింది. నగరంలోని పలు నగల దుకాణాలు, బులియన్ డీలర్ల పాత్ర సైతం ఉందని వ్యాఖ్యానించింది. 18 నగల దుకాణాల నిర్వాహకుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.