ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి సమస్యను దృష్టిలో ఉంచుకొని మహీంద్ర ఆటోమోటివ్ సర్వీసింగ్ సెంటర్లలో ఎకో వాష్ పద్ధతిని ప్రారంభించారు. హైదరాబాద్ మెహదీపట్నం పిల్లర్ నంబర్ 86 వద్ద డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ చేతుల మీదుగా ఈ ప్రయోగాత్మక కెమికల్ వాషింగ్‌ను ప్రారంభించారు.
మహీంద్ర సంస్థ యాజమాన్యం ఏకో వాష్ మొదలుపెట్టటం హర్షించదగ్గ విషయమని డిప్యూటీ మేయన్ బాబా ఫసియోద్దీన్ తెలిపారు. ఈ పద్ధతి వల్ల సుమారు 50 నుంచి 70 లీటర్ల నీటిని పొదుపు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. సాధారణ వాటర్ వాష్‌కు తీసుకునే డబ్బులే కెమికల్ వాష్కూ తీసుకుంటామని నిర్వాహకులు పేర్కొన్నారు.