పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టిగణపతులనే పూజించాలని సికింద్రాబాద్ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు ఉప్పలనచ్చి గీత అన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు కార్ఖానా వాసవీనగర్లో మట్టిగణపతులను పంపిణీ చేశారు.
ఆర్యవైశ్య మహిళా సంఘం స్ఫూర్తితో ప్రజలంతా గణేశ్ ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని వాసవీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్ గుప్త సూచించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు రమారాణి, పలువురు మహిళలు పాల్గొన్నారు.