ఇవీ చూడండి:ఉత్తమ్ తీరు నచ్చకే పార్టీ వీడుతున్నా : చిరుమర్తి
సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి - rajat
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీలో పలు సూచనలు అందాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. మద్యం, డబ్బు ప్రవాహం లేకుండా చూడాలని కోరినట్లు పేర్కొన్నారు. 21, 24 తేదీల్లో సెలవుల దృష్ట్యా నామినేషన్లు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళి కేసులు, చర్యలను రోజూ వెల్లడిస్తామన్నారు. ఎన్నికల విధుల్లో చేరని అధికారులు రేపటిలోగా చేరాలని రజత్ ఆదేశించారు. వేసవి దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు. సున్నితమైన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామన్నారు.
ఇవీ చూడండి:ఉత్తమ్ తీరు నచ్చకే పార్టీ వీడుతున్నా : చిరుమర్తి
Last Updated : Mar 13, 2019, 4:06 PM IST