ETV Bharat / state

'20 జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం' - ఈసీ తాజా వార్తలు

రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు సవరించిన ఓటరు జాబితాను ఈసీ ప్రకటించింది.

'20 జిల్లాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం'

author img

By

Published : Jan 15, 2021, 8:57 PM IST

సవరించిన ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2021 జనవరి 1 వరకు అర్హులైన ఓటర్ల జాబితాను ఈసీ వెలువరించింది. రాష్ట్రంలోని 20 జిల్లాల్లో మహిళా ఓటర్లు పురుషుల కంటే అధికంగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3 కోట్ల ఒక లక్ష 65 వేల 569 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో కొత్తగా ఓటు హక్కు పొందిన వారు 2 లక్షల 82 వేల 497 మందిగా ఉన్నారని ఈసీ పేర్కొంది.

తాజా సవరణలో అనర్హమైన లక్షా 72 వేల 255 ఓట్లను తొలగించినట్లు తెలిపింది. మొత్తం ఓటర్లలో పురుష ఓటర్లు 1,51,61,714 మంది, మహిళా ఓటర్లు 1,50,02,227, ఇతరులు..1,628 గా ఉన్నట్లు జాబితా వెలువరించింది. మొత్తం ఓటర్లలో హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు 43,11,803 ఉండగా, అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,14,291 ఓటర్లు ఉన్నట్లు ఈసీ జాబితా ప్రచురించింది.

ఇదీ చూడండి : 'పారిశుద్ధ్య సిబ్బంది సేవలు భేష్​... టీకాలో వారికే ప్రాధాన్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.