రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఈసీ ఏఎన్ఎంల సర్వీస్‌ను క్రమబద్దీకరించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య ఐకాస ఛైర్మన్ డాక్టర్ బి.రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2003-04లో డీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిన నియమితులైన ఈసీ ఏఏన్ఎంలు చాలీ చాలని జీతాలతో పదోన్నతులు లేకుండానే పదవీ విరమణ పొందుతున్నారని నిరసన వ్యక్తం చేశారు.
జీఓ 119 మేరకు 45 వెయిటేజ్ మార్కులు ఇచ్చి అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ ఒక్క నియామకం చేపట్టలేదన్నారు. బోర్డు ద్వారా శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు రెండువేల పోస్టులను వెంటనే భర్తీ చేయలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి : నాపై దాడి చేశారు... చర్యలు తీసుకోండి : రాహుల్ సిప్లిగంజ్