హైదరాబాద్ ఎల్బీనగర్, భాగ్యలతలోని ఐయాన్ డిజిటల్ జోన్లలో ఎంసెట్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. నిమిషం నిబంధనతో పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే చేరుకున్నారు. థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి విద్యార్థులను లోనికి అనుమతించారు.
మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమంతించారు. విద్యార్థులకు శానిటైజర్ అందుబాటులో ఉంచారు. ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్న ఈ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతుంది. మరో దఫాలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది.
ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించిన ప్రభుత్వం