ETV Bharat / state

EAMCET Exam Preparation Tips : ఇలా ప్రిపేర్ అయితే.. ఎంసెట్​లో మంచి ర్యాంకు పక్కా

EAMCET Exam Preparation Tips : ఇంటర్ పరీక్షలు పూర్తవ్వగానే నెక్స్ట్ ఏం చేస్తావు అంటే చాలా మంది చెప్పే సమాధానం ఇంజినీరింగ్. మరి ఇంజినీరింగ్ చేయడానికి ఏ ఎగ్జామ్ రాస్తున్నావు అని అడిగితే చాలా మంది నుంచి వచ్చే సమాధానం ఎంసెట్. ఎంసెట్ పరీక్షలు ఎంత మంచి ర్యాంకు వస్తే బీటెక్​లో అంత మంచి కాలేజ్ వస్తుంది. అందుకే విద్యార్థులు ఎంసెట్ పరీక్ష అనగానే తెగ కష్టపడి చదివేస్తుంటారు. అయితే కష్టపడటం మంచిదే కానీ కొన్ని టిప్స్ ఫాలో అయి ప్రిపేర్ అయితే ఎంసెట్​లో ఈజీగా మంచి ర్యాంకు కొట్టేయొచ్చు. ఇంటర్ తర్వాత విద్యార్థులు కోర్సుల్లో అగ్రికల్చర్, ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ లాంటి కోర్సుల్లో చేరటానికి రాసే ఎంసెట్/ ఈఏపీసెట్‌ వంటి పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి.. అసలు పరీక్షల సమయంలో ఎలాంటి సూచనలు పాటించాలో తెలుసుకుందామా..?

emcet exam preparation tips
ఎంసెట్ ఎగ్జామ్​కు ప్రిపేర్ అవ్వండిలా..
author img

By

Published : May 8, 2023, 2:48 PM IST

EAMCET Exam Preparation Tips : ఎంసెట్‌/ ఈఏపీసెట్‌లో వచ్చే ర్యాంకు ఆధారంగానే విద్యార్థి కాలేజీని, బ్రాంచ్​ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రవేశ పరీక్షలో కనీసం సగం ప్రశ్నలకు సమాధానాలను సరిగ్గా గుర్తించగలిగితే.. అంటే 50 శాతం మార్కులు సాధించగలిగినా మంచి కాలేజీలలో సీటు వస్తుంది. తెలంగాణలో మే 10 నుంచి 14 వరకూ, ఆంధ్రప్రదేశ్‌లో మే 15 నుంచి 23 వరకూ ఎంసెట్‌/ఈఏపీ సెట్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రానికి విద్యార్థులు కనీసం గంట ముందుగా చేరుకునేట్లు చూసుకోవాలి. హాల్‌టికెట్‌తో పాటు ఇచ్చే సూచనలు పాటించాలి.

ఈ టిప్స్ పాటించండి.. పరీక్షలో మంచి ర్యాంకు కొట్టేయండి..

  • పరీక్షకు ఇంకా ఒక వారమే ఉంది కాబట్టి ఈ చివరి వారాన్ని పూర్తిగా పునశ్చరణకు మాత్రమే కేటాయించాలి.
  • ముఖ్యమైన టాపిక్​లను పునశ్చరణ చేసుకోవాలి.
  • రోజులో అన్ని సబ్జెక్టులను కవర్ అయ్యేలా రివైజ్ చేసుకోవాలి.
  • సమయం తక్కువగా ఉన్నప్పుడు కొత్త అంశాలపై దృష్టి పెట్టకుండా చదివిన వాటినే మళ్లీ రివైజ్ చేసుకోవాలి.
  • మెమరీ బేస్డ్ కాన్సెప్టులను, ముఖ్యమైన ఫార్ములాలను రివైజ్ చేసుకోవాలి.
  • పాత పేపర్లను మోక్ టెస్ట్​లు చేయాలి, గ్రాండ్ టెస్టులు రాయాలి
  • నీట్, మెయిన్స్ లాంటి పరీక్షల ఒరవడికి అలవాటైన విద్యార్థులు ఎంసెట్‌లో 160 ప్రశ్నలు పూర్తిగా చదవాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రశ్నలను ఓపికగా, త్వరగా చదవడం, జవాబులను గుర్తించడం లాంటివి చేయాలి.
  • నెగిటివ్ మార్కింగ్ లేకపోవడం వల్ల ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించాలి.
  • తెలిసిన ప్రశ్నలకు ముందుగా సమాధానాలు రాసుకుని.. తర్వాత వదిలేసిన ప్రశ్నలను రాయాలి.
  • సమాధానం తెలియని ప్రశ్నలకు ఎక్కువ సమయం వెచ్చించకుండా, తెలిసని దానిని త్వరగా రాసుకోవాలి.
  • పరీక్షలో చివరి పది నిమిషాలు అన్నింటికి సమాధానాలు రాశామో లేదో చూసుకోవాలి.

ఇంట్రెస్ట్ ఎక్కువ ఉన్న సబ్జెక్టుతో.. పరీక్షను మనకిష్టమైన సబ్జెక్టుతో ప్రారంభించాలి. ప్రశ్న కఠినంగా అనిపిస్తే ఈజీ ఉన్న ప్రశ్నలకు సమాధానాలను గుర్తించి.. తర్వాత హార్డ్ ప్రశ్నల గురించి ఆలోచించడం ఉత్తమం. విద్యార్థులు 180 నిమిషాల వ్యవధిలో 160 ప్రశ్నలను సమాధానాలు రాయాలి. మిగిలిన సమయంలో సమాధానం ఇవ్వని ప్రశ్నల గురించి ఆలోచించాలి.

emcet exam preparation tips
ఎంసెట్ ఎగ్జామ్​కు ప్రిపేర్ అవ్వండిలా..

గణిత శాస్త్రం:ఈ సబ్జెక్టులో ఫార్ములాలను అధికంగా గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. అది చాలా ముఖ్యం కూడా. భౌతిక, రసాయన శాస్త్రాల్లోని కలిసి ఉన్న మార్కులు కేవలం ఒక్క గణితంలోనే ఉంటాయి. గంటన్నరలోనే దాదాపు 80 ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. అర్థంకాని ప్రశ్నల దగ్గర టైం వేస్ట్ చేయకుండా ఈజీగా ఉన్న ప్రశ్నలకు ముందుగా సమాధానాలు గుర్తించాలి. తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించిన తర్వాత.. వదిలేసిన ప్రశ్నలకు సమాధానాలను గుర్తించాలి.

emcet exam preparation tips
ఎంసెట్ ఎగ్జామ్​కు ప్రిపేర్ అవ్వండిలా..

వృక్ష శాస్త్రం: వృక్షశాస్త్రంలో , అనువర్తనాలు, జీవసాంకేతికశాస్త్రం, ఖనిజపోషకాలు, వృక్షరాజ్యం, ఎంజైమ్‌లు, వృక్ష ఆవరణశాస్త్రం, జీవశాస్త్ర వర్గీకరణ, సూక్ష్మజీవశాస్త్రం, , కణజీవశాస్త్రం మొక్కల్లో ప్రత్యుత్పత్తి ముఖ్యమైనవి. ఈ పాఠాలను పరీక్షకు ముందు అంతా ఒకసారి రివైజ్ చేసుకోండి.

జంతు శాస్త్రం: జంతు శాస్త్రంలో ముఖ్యమైనది మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ, జంతు వైవిధ్యం, ఆరోగ్యం, గమనం, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం చాలా ముఖ్యమైనవి. వీటిని రివైజ్ చేసుకుంటూ మాక్ టెస్ట్​లు రాయాలి.

emcet exam preparation tips
ఎంసెట్ ఎగ్జామ్​కు ప్రిపేర్ అవ్వండిలా..

భౌతిక శాస్త్రం: భౌతికశాస్త్రం అనేది వివిధ సూత్రాలు, సిద్దాంతాల చుట్టూ తిరుగుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచి 70శాతం, సెకండ్ ఇయర్ పాఠాల నుంచి 100శాతం ప్రశ్నలు ఉంటాయి. శుద్ధ గతికశాస్త్రం, గురుత్వాకర్షణ, స్థితిస్థాపకత, గతిశాస్త్రం, అణునిర్మాణశాస్త్రం, ఉష్ణగతిక శాస్త్రం, విద్యుత్తు పాఠాలను ప్రిపరేషన్​లో ముఖ్యంగా భావించి రివైజ్ చేసుకోవాలి. పాత ప్రశ్నాపత్రాలను రివైజ్ చేయడం వల్ల పేపరు ఎలా వస్తుందో మనుకు కొంత అవగాహన వస్తుంది. ఎంసెట్‌లో ఫిజిక్స్‌కి 40 ప్రశ్నలు/ 40 మార్కులకు ఉంటాయి. అందులో దాదాపు 20 ప్రశ్నలు కాన్సెప్ట్‌, ఫార్ములాలపై ఆధారపడి ఉంటాయి. ఎంసెట్ ర్యాంకులో ఇంటర్ మార్కులతో సంబంధం ఉండదు. కాబట్టి ప్రతి మార్కు చాలా ముఖ్యమైనది. సెకండ్ ఇయర్ టాపిక్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.

emcet exam preparation tips
ఎంసెట్ ఎగ్జామ్​కు ప్రిపేర్ అవ్వండిలా..

రసాయన శాస్త్రం: రసాయన శాస్త్రంలో ఎక్కువ వెయిటేజి ఉన్న లెసన్స్ చదవాలి. ముఖ్యమైన పాఠాలను ఒకటికి రెండు సార్లు రివైజ్ చేసుకుంటే బెటర్. ఆమ్లాలు, క్షారాలు, ఆవర్తన పట్టిక, పరమాణు సూత్రాలు చూసుకుంటే దాదాపు 50శాతం ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. రసాయన గతికశాస్త్రం, ఉష్ణగతికశాస్త్రం, రసాయన బంధం, నేమ్డ్‌ రియాక్షన్స్‌ చూసుకుంటే 25మార్కుల వరకు సాధించవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.