ఇంజినీరింగ్ రుసుములపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూలులో మార్పులు చేశారు. రేపటి నుంచి జరగాల్సిన వెబ్ ఆప్షన్ల నమోదును... జులై 1 నుంచి 4 వరకు చేపట్టాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. అయితే ధ్రువపత్రాల పరిశీలన రేపటి నుంచి అభ్యర్థులు బుక్ చేసుకున్న స్లాట్ ప్రకారం యథాతథంగా కొనసాగనుంది. దీనికోసం ఇప్పటి వరకు 45 వేల 156 మంది విద్యార్థులు స్లాట్లు తీసుకున్నారు. ప్రభుత్వం ఏఎఫ్ఆర్సీ ఛైర్మన్‌ను నియమించకపోవడం వల్ల ఫీజులు ఖరారు కాలేదు. కొన్ని ప్రైవేటు కాలేజీలు హైకోర్టుకు వెళ్లి వారు ప్రతిపాదించిన భారీ రుసుములు వసూలు చేసుకోవడానికి అనుమతి పొందాయి. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఒకటి, రెండు రోజుల్లో అప్పీల్ దాఖలు చేసేందుకు విద్యా శాఖ సిద్ధమవుతోంది. ఫీజులపై స్పష్టత వస్తేనే విద్యార్థులు కళాశాల, కోర్సును ఎంచుకునే అవకాశం ఉంది.
ఇదీ చూడండి : అమెరికాలో 11 నిమిషాలకు ఒక డ్రగ్ మరణం