ETV Bharat / state

ఫార్ములా ఈ ప్రాక్టీస్​ రేస్​లో గందరగోళం..​ ట్రాక్​పైకి దూసుకొచ్చిన సాధారణ వాహనాలు

ఫార్ములా ఈ ప్రాక్టీస్​ రేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రేసింగ్​ ట్రాక్​పైకి ఒక్కసారిగా సాధారణ వాహనాలు దూసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో ప్రాక్టీస్​ రేసు ఆలస్యంగా జరిగింది. ఘటనకు కారణమైన కానిస్టేబుళ్లపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

e race
ఈ రేస్​
author img

By

Published : Feb 10, 2023, 7:02 PM IST

Updated : Feb 10, 2023, 7:47 PM IST

హైదరాబాద్​లో జరుగుతోన్న ఫార్ములా ఈ ప్రాక్టీస్​ రేస్​ మొదటి విడత ముగిసింది. రేపు ఉదయం 8.10 గంటలకు రెండో ప్రాక్టీస్ రేసు జరగనుంది. అంతకుముందు ప్రాక్టిస్​ రేస్​లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దీంతో రేస్​ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. సాయంత్రం 4.30 గంటలకు రేస్​ జరగాల్సి ఉండగా.. ఇంతలోనే ఒక్కసారిగా సాధారణ వాహనాలు ట్రాక్​పైకి దూసుకొచ్చాయి. ఊహించని ఘటనతో అప్రమత్తమైన నిర్వాహకులు రేస్​ను 45 నిమిషాల పాటు నిలుపుదల చేశారు. ట్రాఫిక్​ కానిస్టేబుళ్ల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగినట్లు గుర్తించారు. ట్రాక్​ మొత్తం కలియతిరిగి తనిఖీ నిర్వహించారు. అనంతరం రేసింగ్​ను ప్రారంభించారు. కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

ఫార్ములా ఈ ప్రాక్టీస్​ రేస్​లో గందరగోళం

ఫార్ములా ఈ-రేస్​ మొదటి ప్రాక్టీస్​ రేసు దాదాపు 30 నిమిషాలు జరిగింది. హుస్సేన్​సాగర్​ తీరంలో ప్రత్యేక ట్రాక్​పై రేసింగ్​ నిర్వహించారు.లుంబినీ పార్క్​ నుంచి ఎన్టీఆర్​ గార్డెన్​ వరకు ఈ రేస్​ జరిగింది. రేస్​లో 11 ప్రముఖ కంపెనీల ఎలక్ట్రిక్​ కార్లు, 22 మంది డ్రైవర్లు పాల్గొన్నారు. ఈ రేసింగ్​ను చూడడానికి నారా లోకేశ్​ సతీమణి నారా బ్రాహ్మిణి, మహేశ్​బాబు భార్య నమ్రత, ప్రముఖ బ్యాడ్మింటన్​ క్రీడాకారిని పీవీ సింధు వచ్చారు.

ఈ రేసింగ్​లో స్వల్ప ప్రమాదం: రేసింగ్​ ప్రారంభంలో స్వల్ప ప్రమాదం జరిగింది. మూల మలుపు వద్ద ఓ కారు డివైడర్​ను ఢీకొట్టింది. దీంతో కొంతసేపు రేస్​ను నిర్వాహకులు నిలుపుదల చేశారు. అనంతరం యధావిధిగా రేస్​ను నిర్వహించారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 10, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.