కాగితాలు, దస్త్రాలతో సంబంధం లేకుండా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ధ్యేయంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో ఈ-ఆఫీస్ విధానాన్ని ప్రారంభించారు. మొదటగా ఆరు శాఖల్లో ఈ విధానాన్ని అమలు చేస్తుండగా ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులకు అవసరమైన శిక్షణ ఇచ్చారు. సాధారణ పరిపాలన, ఐటీ, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, సీసీఎల్ఏ, మహిళా-శిశు సంక్షేమ శాఖల్లో ఈ-ఆఫీస్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ప్రారంభించారు.
ఈ-ఆఫీస్ ద్వారా 1600 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తారని, ఈ విధానం పూర్తి పారదర్శకతను తీసుకొస్తుందని, ప్రయోజనకరంగా ఉంటుందని సోమేశ్ కుమార్ తెలిపారు. ఈ-ఆఫీస్ విధానం ఎంతో విలువైన సమయాన్ని, కాగితాన్ని పొదుపు చేస్తుందని అన్నారు. కాగితాలతో సంబంధం లేకుండా ఈ-ఆఫీస్ విధానం ద్వారా పనిచేయడం సౌకర్యవంతంగా ఉందని అధికారులు, ఉద్యోగులు తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు