కరోనా కష్టకాలంలోనూ కేంద్ర ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచేలా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరికాదని భారత ప్రజాతంత్ర యువసేన సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని అడ్డగుట్ట పెట్రోల్ బంక్ ఎదుట సమాఖ్య నాయకులు నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ... ధరలను తగ్గించాలని ప్లకార్డులను ప్రదర్శించారు.
కరోనా విపత్కరకాలంలో కేంద్ర ప్రభుత్వం 13 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సరైనదా? అని సమాఖ్య నగర కార్యదర్శి మహేందర్ ప్రశ్నించారు. ఉపాధి కోల్పోయి చేతిలో పనులు లేక.. తినడానికి తిండిలేక.. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగుట్ట డివిజన్ డివైఎఫ్ఐ నాయకులు జె.ఈశ్వర్, పి.మహేష్, డి.మహేష్, సి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'కొవిడ్ బాధితుల బిడ్డలకు మాదీ భరోసా'