నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ సికింద్రాబాద్ ఓలిఫెంట బ్రిడ్జి వద్ద డీవైఎఫ్‌ఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగి సునీల్ నాయక్ మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసకారులను గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
ఇదీ చదవండి: ఓడ, పడవ ఢీ- 17 మంది గల్లంతు