ETV Bharat / state

డ్వాక్రా మహిళలకు వారంలోనే రుణం

తెలంగాణ డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకు నుంచి రుణం మంజూరు కానుంది. నగదు వారి వ్యక్తిగత ఖాతాలో నేరుగా జమవుతుంది. ఇక నుంచి దరఖాస్తులు పట్టుకుని బ్యాంకుల చుట్టూ తిరగనవసరం లేదు.

డ్వాక్రా మహిళలకు వారంలోనే రుణం
author img

By

Published : Nov 19, 2019, 6:18 AM IST

రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వారం రోజుల వ్యవధిలోనే బ్యాంకు నుంచి రుణం మంజూరు చేయనున్నారు. రుణ మంజూరీ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌ ద్వారానే పూర్తయ్యేలా కొత్త విధానం తీసుకొచ్చేందుకు పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) తాజాగా చర్యలు చేపట్టింది. మరోవైపు బ్యాంకులకు పనిభారం తగ్గనుంది.

మొత్తం 46 లక్షల మంది

రాష్ట్రంలో 4.5 లక్షల డ్వాక్రా సంఘాల్లో 46 లక్షల మంది బడుగు వర్గాల మహిళలు సభ్యులుగా ఉన్నారు. సంఘం సీనియార్టీ ఆధారంగా రూ. 50 వేలు మొదలుకుని రూ.10 లక్షల వరకు బ్యాంకులు రుణాలను ఇస్తుంటాయి. ప్రస్తుతం 2019-20లో ఇలా రూ.6,584 కోట్లను ఇవ్వాలనేది లక్ష్యం. మొత్తం 46 లక్షల మంది సభ్యుల పేర్లు ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. రుణం కావాల్సిన సంఘం వివరాలను కేవలం ఒక పేజీలో పేర్కొని దాని ఫొటోను అప్‌లోడ్‌ చేస్తే వారం వ్యవధిలోనే అధికారి ఆమోద ముద్ర పడి బ్యాంకు నుంచి రుణం మంజూరవుతుంది.

నేరుగా మహిళల ఖాతాల్లో
ఇంతకు ముందైతే రుణాన్ని డ్వాక్రా సంఘం ప్రతినిధులు డ్రా చేసి దాన్ని తిరిగి తమ సభ్యులకు పంచేటప్పుడు ఏవేవో ఖర్చులంటూ కొంత వెనకేసుకునేవారు. ఇప్పుడిక వారి ప్రమేయము ఉండదు. డ్వాక్రా సంఘంలోని ఏ సభ్యురాలికి ఎంత రుణం అవసరమనేది సెర్ప్‌ సిబ్బంది ముందుగానే అంచనా వేసి ఆన్‌లైన్‌లో పేర్కొంటారు. దీనికి తగ్గట్టుగానే బ్యాంకు నేరుగా ఆయా మహిళల ఖాతాల్లో రుణాన్ని జమ చేస్తుంది.

రుసుముల బాదుడు ఉండబోదు
రుణ మంజూరీ ప్రక్రియ ఆన్‌లైన్‌ కావటం వల్ల ఇప్పుడిక బ్యాంకు రుసుముల బాదుడు ఉండబోదు. రాష్ట్రంలోని కొన్ని బ్యాంకులు.. తనిఖీ, వ్యవహారాల ఛార్జీలంటూ గుంజటం ఆర్‌బీఐ నిబంధనలకు విరుద్ధమంటూ ఇటీవల సెర్ప్‌ సీఈవో పౌసమి బసు.. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితికి ఫిర్యాదు చేశారు. బ్యాంకులు రుసుములను విధిస్తే సంఘ మహిళలకు ట్యాబ్‌లో ఇట్టే తెలిసిపోతుంది కనుక వారు ప్రశ్నించేందుకు వీలవుతుంది.

ఇదీ చూడండి : పరిశ్రమలో పేలుడు.. ఎగిరిపడిన శకలాలు

Intro:Body:

eenadu

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.