హైదరాబాద్ మలక్‌పేటలోని ఏపీఐ కాలనీలో తాగునీటిలో డ్రైనేజీ నీరు కలిసి సరఫరా అవుతోంది. దీనిపై కాలనీ వాసులు కలుషిత నీటిని బాటిల్లో నింపి వాటర్ బోర్డు కార్యాలయం ముందు నిరసన తెలిపారు. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అనారోగ్య సమస్యలు
కలుషిత నీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని కాలనీ వాసులు వాపోయారు. తాగు నీటి సమస్యపై ఆరు నెలలుగా అధికారులకు ఫిర్యాదు చేసినా... పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చూడండి : భక్తగిరిగా మారిన యాదాద్రి