ETV Bharat / state

Dussehra Special Home Foods : పండుగల వేళ.. 'హోమ్ ఫుడ్స్​'కు నగరవాసుల ఫిదా.. గారెలు, అరిసెలు, కారప్పూసలు.. పిండి వంటలేవైనా..!

Dussehra Special Home Foods : తెలంగాణలో దసరా పండుగను ధూంధాంగా జరుపుకుంటారు. పండుగ రోజున ప్రతి ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. హైదరాబాద్ మహా నగరంలో ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితమే! పిండి వంటలను తయారు చేసుకునేందుకు సమయం ఉండదు. దీంతో చాలా మంది 'హోమ్ ఫుడ్స్​' మీదనే ఆధారపడుతున్నారు. ఇంట్లో తయారు చేసేటువంటి నాణ్యత, శుచి ఉండటంతో వాటికి డిమాండ్ పెరిగిపోయింది. దసరా, దీపావళి వంటి పండుగ రోజుల్లో గిరాకీ మరింత ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Home Foods Demand on The Occasion of Dussehra
Dussehra Special Home Foods
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 23, 2023, 12:11 PM IST

Dussehra Special Home Foods పండుగల వేళ.. హోమ్​ఫుడ్స్​కు ఉండే డిమాండే వేరు

Dussehra Special Home Foods : దసరా పండుగ రోజున నోరూరించే పిండి వంటలు చేసుకోవడం ఆనవాయితీ. తెలంగాణాలో గారెలు, అరిసెలు, మడుగులు, కారప్పూసలు, సకినాలు, లడ్డూలు, కారా, జిలేబీ, బూందీ, చెగోడీలు, కరిజలు వంటి నోరూరించే పిండి వంటలు చేసుకుంటారు. కానీ.. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు వాటిని చేసుకునేంత ఓపిక, తీరిక ఉండడం లేదు. దీంతో చాలా మంది పిండి వంటలు అనగానే 'హోమ్​ ఫుడ్స్'​కు పరుగులు తీస్తున్నారు. హోమ్​ ఫుడ్స్​లో అందరికీ ఇష్టమైన ఖాజాలు, సున్నుండలు, పూతరేకులు, రకరకాల మిఠాయిలు కూడా లభిస్తున్నాయి. వీటితో పాటు రోజూ తినేటువంటి పచ్చళ్లు, పొడులు కూడా లభిస్తున్నాయి.

Tallest Effigy of Ravana : దేశంలోనే అత్యంత ఎత్తైన రావణుడి బొమ్మ.. 171 అడుగుల ఎత్తుతో..

ఇంట్లో చేసేటువంటి రుచి, శుచి ఉండటంతో చాలా మంది హోంపుడ్స్​లో కొనుగోలు చేస్తున్నారు. పూర్వకాలంలో పిండివంటలను చేసేందుకు చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు అందరూ కలిసి చేసుకునేవాళ్లు. కానీ.. ఇప్పుడా రోజులు లేవు. ఎవరి ఇంట్లో వారే చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో చేసే ఓపిక లేకపోవడం వల్ల హోమ్​ పుడ్స్ ను ఆశ్రయిస్తున్నామని నగరవాసులు పేర్కొంటున్నారు. పండుగ రోజుల్లో ఎక్కువ కొనుగోళ్లు జరుగుతుంటాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం కొనుగోలు చేసేవారి అభిరుచికి అనుగుణంగా పిండి వంటలు చేయడమే అని పేర్కొంటున్నారు.

"అప్పటి కాలంలో పండుగ అంటే చాలా రకాల పిండి వంటకాలు చేసుకునే వాళ్లం. ఉమ్మడి కుటుంబాలు.. పండుగను సందడిగా జరిపేవాళ్లం. డబ్బులు ఎక్కువయ్యాయి. ప్రేమలు దూరమయ్యాయి. ఇప్పుడు ఓపిక లేక 'హోమ్ ​ఫుడ్స్'​ నుంచి తెచ్చుకుంటున్నాం."- చంద్రికా గౌడ్, కొనుగోలుదారు.

Home Foods Demand on The Occasion of Dussehra : నగరంలోని చాలా ప్రాంతాల్లో 'హోమ్​ పుడ్స్' వెలిశాయి. నగరంలోని ఎస్.ఆర్.నగర్, హిమాయత్ నగర్, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్​పల్లి, సరూర్ నగర్, హైటెక్ సిటీ, దిల్​సుఖ్​నగర్, కొత్తపేట్, నాగోల్, ఉప్పల్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. నాణ్యమైన వంటకాలు తక్కవ ధరల్లో లభిస్తుండటంతో ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వంటకాల్లో కూడా నాణ్యమైన నూనెను వినియోగిస్తుంటామని చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో కావాల్సి వచ్చినప్పుడు ఆర్డర్ ప్రకారం వారు చెప్పిన విధంగా వంటకాలు సిద్దం చేస్తామని హోమ్​ ఫుడ్స్ నిర్వాహకులు పేర్కొంటున్నారు.

Happy Dasara 2023 : దసరా స్పెషల్ గ్రీటింగ్స్.. కోట్స్.. మీవారికి ఇలా శుభాకాంక్షలు చెప్పండి!

ఇటీవలి కాలంలో ఇంట్లో జరిగే శుభకార్యాలకు కూడా ఎక్కువ మంది హోమ్​ ఫుడ్స్​పైనే ఆధారపడుతున్నారు. ఇంటికి బంధువులు వచ్చినా.. ఎక్కువ శాతం హోమ్​ ఫుడ్స్​లోనే కొనుగోలు చేస్తున్నట్లు నగరవాసులు పేర్కొంటున్నారు. దీనికి ప్రధాన కారణం వంటలు చేసేందుకు ఎక్కువ సమయం పట్టడంతో పాటు, ఓపిక కావాలంటున్నారు. పైగా.. ఒక్కరితో పిండివంటలు చేయడం కష్టమవుతుందని, ఈ మహా నగరంలో ఇతరులు వచ్చి సాయం చేసే సమయం ఉండదు కాబట్టి హోమ్​ ఫుడ్స్​లోనే పిండి వంటలు కొనుగోలు చేస్తున్నామని నగరవాసులు చెబుతున్నారు.

Dasara Special Non Veg Recipes : దసరాకి మటన్​ కర్రీ ఇలా ట్రై చేయండి.. వావ్ అనాల్సిందే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.