బాలీవుడ్ కథానాయిక జోయ ఆఫ్రోజ్ నగరంలో సందడి చేశారు. తన ఆటపాటలతో అదరహో అనిపించారు. హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీక్లబ్‌లో దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆసియా బిగెస్ట్ నవరాత్రి ఉత్సవ్-2019 పోస్టర్‌ను ఆవిష్కరించారు. కళాకారులతో కలిసి జోయ చేసిన నృత్యాలు అందరిని అలరించాయి. ప్రతి ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాలను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకుంటానని... ఈ ఏడాది కంట్రీక్లబ్‌లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటున్నట్లు ఆమె తెలిపారు. త్వరలోనే కాశ్మీర్‌లో కంట్రీక్లబ్‌ను ప్రారంభిస్తున్నట్లు ఎండీ రాజీవ్‌రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి :జాబిల్లిని ముద్దాడే వేళ... విక్రమ్, ప్రజ్ఞాన్ పరిహాసాలు