Dussehra holidays దసరా సెలవులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. సెలవులు తగ్గించాలన్న రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ప్రతిపాదనను తిరస్కరించింది. సెలవుల్లో ఎలాంటి మార్పు లేదని.. ఈనెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు యథాతథంగా పాఠశాలలకు సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది.. అక్టోబర్ 10న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. భారీ వర్షాల కారణంగా జులైలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినందున.. నష్టపోయిన బోధన పనిదినాల భర్తీకి దసరా సెలవులు తగ్గించాలని పాఠశాల విద్యాశాఖకు ఎస్‌సీఈఆర్‌టీ సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ తొలుత ప్రకటించిన విధంగానే దసరా సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది.
ఇవీ చూడండి: