Dussehra Festival Celebrations at Pragati Bhavan : విజయదశమి వేడుకలు ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండగ (Dussehra Festival 2023)ను పురస్కరించుకొని తొలుత అక్కడే ఉన్న నల్లపోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శమీ పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా జమ్మి చెట్టుకు సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్విహంచారు. అనంతరం సీఎం కేసీఆర్ కుటుంబానికి విజయాలు సిద్ధించాలని పూజారులు ఆశీర్వదించారు.
శుభసూచకంగా భావించే పాలపిట్టను ముఖ్యమంత్రి కేసీఆర్ దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం.. దసరా నాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షును తీసుకొని సీఎం పాల్గొన్నారు. అనంతరం పండితులు నిర్వహించిన సాంప్రదాయంగా చేసే ఆయుధ పూజలో కేసీఆర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు పండితులు తీర్థ ప్రసాదాలు ఇచ్చి.. అనంతరం ఆశీర్వదించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది మంగళ హారతులు తీసుకున్నారు.
Dussehra Festival Celebrations 2023 : ఆ తర్వాత సీఎం కేసీఆర్ నుంచి సిబ్బంది ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా అందరికీ ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సుభీక్షంగా ఉండాలని.. ప్రజలందరూ సుఖ, సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకున్నట్లు సీఎం తెలిపారు. అలాగే రాష్ట్రానికి మంచి విజయాలు సిద్ధించాలని ప్రార్థించారు. కర్ణాటక శృంగేరి పీఠం నుంచి తీసుకొని వచ్చిన శారదాదేవి నవరాత్రోత్సవ ప్రసాదాన్ని పూజారులు ముఖ్యమంత్రి దంపతులకు అందజేశారు. అంతకు ముందు మంత్రి కేటీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలను తెలిపారు. మంచి పనులన్నింటిలో విజయం కలగాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో ఘనంగా నవరాత్రులు : అలాగే ఓరుగల్లు వాసుల ఇలవేల్పు భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. అంకురార్పణతో ప్రారంభమైన వేడుకలు.. ఈరోజు సాయంత్రం తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్సవాల్లో చివరి రోజు భద్రకాళి మాతగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం నుంచి పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని తీరొక పూలతో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా దసరా పండగ ఘనంగా జరిగింది. ప్రతి పల్లె పండగ వాతావరణంతో మెరిసిపోతుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి హైదరాబాద్ నగర వాసులు పోటెత్తారు.
Saddula Bathukamma Celebrations 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు..
Dussehra 2023 Oct 23rd or 24th : దసరా 23నా.. 24వ తేదీనా..? పండితులు ఏం చెబుతున్నారంటే..?