లాక్ డౌన్ నేపథ్యంలో.. అల్వాల్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో పేద ప్రజలకు టీం సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ చేశారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నపుడు దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని భాజపా పార్లమెంటరీ వ్యవహారాల సెక్రటరీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా.. రసాయన ద్రావణాలు పిచికారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత 50 రోజులుగా వలస కూలీలకు చేయూతనిస్తూ.. నిత్యావసర సరకులు, అన్నదానం చేస్తున్న టీం సాయి పాండమిక్ టాస్క్ ఫోర్స్ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు.
ఇదీ చూడండి: ఇంటర్ మూల్యాంకనం చేసే అధ్యాపకుల ఆందోళన