ETV Bharat / state

విజయవాడ ప్రజల కల సాకారం... అందుబాటులోకి కనకదుర్గ ఫ్లైఓవర్

ఏపీ విజయవాడ ప్రజల కల సాకారమైంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఏపీ సీఎం జగన్.... వర్చువల్ విధానంలో ఫ్లైఓవర్​ను ప్రారంభించారు. మరో రూ. 15 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకూ.... శంకుస్థాపన చేశారు.

విజయవాడ ప్రజల కల సాకారం... అందుబాటులోకి కనకదుర్గ ఫ్లైఓవర్
విజయవాడ ప్రజల కల సాకారం... అందుబాటులోకి కనకదుర్గ ఫ్లైఓవర్
author img

By

Published : Oct 16, 2020, 3:26 PM IST

ఏపీ బెజవాడ ప్రజలకు దసరా కానుకగా కనకదుర్గ వంతెన అందుబాటులోకి వచ్చింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ వంతెన..... ఎట్టకేలకు ప్రారంభమైంది. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి జగన్...... వంతెనను జాతికి అంకితం చేశారు. ఇంజినీరింగ్ అద్భుతంగా, దేశంలోనే పొడవైన ఫ్లైఓవర్​గా పేరొందిన ఈ వంతెన.... విజయవాడ నగరానికి సరికొత్త ఆభరణంగా మారనుంది. స్పైన్ అండ్ వింగ్స్ సాంకేతికతతో దేశంలో నిర్మితమైన అతి పొడవైన వంతెనగా నిలిచింది.

దిల్లీ, ముంబయి తర్వాత ఈ సాంకేతికతతో దేశంలో నిర్మించిన మూడో వంతెన ఇది. అనేక మలుపులతో వంతెన నిర్మాణమైంది. రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ. వంతెన నిర్మించారు. 900 పనిదినాలలో పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మెుత్తంగా రూ. 15వేల 592 కోట్ల అంచనాలతో 61 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.

9 జాతీయ రహదారుల ప్రాజెక్టులు జాతికి అంకితం చేయటంతో పాటు... 16 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ వంతెన ప్రారంభంతో దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని.... విజయవాడ నగర వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కేంద్రం సహకారం మరువలేనిది: జగన్

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కేంద్ర సహకారం మరవలేనిదని..సీఎం జగన్ అన్నారు. రహదారుల అభివృద్ధికి కేంద్రమంత్రి గడ్కరీ చొరవ చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ వంతెన ద్వారా విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయని సీఎం అన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులను కూడా పూర్తిచేసి... పోర్టులను జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని కోరారు.

ఏపీ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అన్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పై వంతెన కల సాకారమైందని... విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తొలగనున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయడం శుభపరిణామని కొనియాడారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.