నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న అంతరాష్ట్ర దొంగల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.3.98లక్షలు విలువ చేసే నకిలీ కరెన్సీ, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజని కుమార్ తెలిపారు. పాతబస్తీలోని తలాబ్ కట్టకు చెందిన మహ్మద్ గౌస్, పశ్చిమ బంగ వాసి రబీఉల్ షేక్, అమీనుల్ రహ్మన్ ముఠాగా ఏర్పడి నకిలీ నోట్ల దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు.
బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నకిలీ నోట్లను తయారు చేసి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చలామణిలోకి తెచ్చేందుకు ఈ ముఠా ప్రయత్నిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. మహ్మద్ గౌస్‌పై 1991లోనే రౌడీషీటర్‌గా టాడా చట్టం కింద కేసులు ఉన్నాయి. 2011 నుంచి దొంగ నోట్ల రవాణా చేసే దందా మొదలు పెట్టాడు.