కేసీఆర్ పుట్టిన గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పారు. సిద్దిపేట గడ్డ మీద పోలీసులు బెదిరించినా భాజపా కార్యకర్తలు అండగా ఉన్నారన్నారు.
హైదరాబాద్, రాచకొండ, సిద్దిపేట పోలీస్ కమిషనర్‌లు తీవ్ర ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే శిక్ష తప్పదన్నారు.
దుబ్బాకలో తనకెలాంటి అవకాశం ఇచ్చారో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అలాంటి విజయం అందించాలని కోరారు. దుబ్బాక ఎన్నికల్లో గెలిపించి శాసనసభకు పంపించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: దుబ్బాక ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు ప్రమాణం