ప్రజల్లో స్థానం కోల్పోయిన తెరాస నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారని మండిపడ్డారు. భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని కేటీఆర్ ఆరోపించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్, భాజపా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఇంతవరకు కలిసి పోటీచేయలేదన్న విషయం గుర్తెరిగి మాట్లాడాలని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకున్న ఘనత తెరాసకే దక్కుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, తెరాస పార్టీలు అబద్ధపు ప్రచారాలు చేసి ఒకటి, రెండు ఓట్ల శాతం తగ్గించే కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ఎన్ని అపోహలు సృష్టించిన భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధిస్తారని స్పష్టం చేశారు. భాజపా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ కూడా ఇంతవరకు కలిసి పోటీచేయలేదన్న విషయం తెలుసుకోవాలని సూచించారు.
"హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో మంత్రి కేటీఆర్ ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. భాజపా, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని, ఈటల రాజేందర్ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో రహస్యంగా భేటీ అయ్యారని కేటీఆర్ అంటున్నారు. ఐటీశాఖ మంత్రికి నేను సూటి ప్రశ్న వేస్తున్న... కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసి అధికారాన్ని పంచుకున్న ఘనత తెరాసది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి దిల్లీనుంచి గల్లీదాక అధికారాన్ని పంచుకున్న చరిత్ర తెరాసది కాదా కేటీఆర్...? రేవంత్‌రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయంతో తమపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ రెండు పార్టీలు హుజూరాబాద్ ప్రజల్లో స్థానం కోల్పోయాయి. కాంగ్రెస్, తెరాస అబద్ధపు ప్రచారాలు చేసి ఒకటి, రెండు ఓట్ల శాతం తగ్గించాలని చూస్తున్నారు. కాంగ్రెస్, తెరాస నేతలు ఎన్ని అపోహాలు సృష్టించినా భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ విజయాన్ని ఆపలేరు"
--రఘునందన్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే
ఇదీ చదవండి: KISHAN REDDY: అబద్దాలు ఆడటం కేసీఆర్ లక్షణం .. మడమ తిప్పడం ఆయన నైజం