దుబ్బాక ఉప ఎన్నికల్లో అన్ని పార్టీలు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించాయని... ఫలితాలు వాయిదా వేయాలని దుబ్బాక స్వతంత్ర అభ్యర్థులు కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి జరిగిన ఉల్లంఘనలపై విచారణ జరిపి... వారిపై చర్యలు తీసుకోవాలని స్వతంత్ర అభ్యర్థులు కంటె సాయన్న, వేముల విక్రంరెడ్డి, మోతే నరేశ్ విజ్ఞప్తి చేశారు. కొందరు అధికారులూ వీటిని ప్రోత్సహించారని హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు.
ఎన్నికల సంఘం ఒక్క ఛాయ్‌కి రూ.8లు లెక్కలు వేసిందని... కొన్ని పార్టీలు వేలమందికి ఎన్ని వేలు ఖర్చు చేశారో లెక్కలు లేవని విమర్శించారు. ఇష్టానుసారంగా రూ.కోట్ల నగదును పంచిపెట్టినా... అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో అన్ని కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం