ETV Bharat / state

DSC Candidates Protest at Assembly in Telangana : మెగా నోటిఫికేషన్ కావాలంటూ అసెంబ్లీ ముందు​ డీఎస్సీ అభ్యర్థుల మహాధర్నా

DSC Candidates Protest for Mega DSC in TS : డీఎస్సీ నోటిఫికేషన్​లో తక్కువ ఉపాధ్యాయ పోస్టులు ప్రకటించారని డీఎడ్​, బీఎడ్​ అభ్యర్థులు అసెంబ్లీ ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించిన మెగా డీఎస్సీనే కావాలని డిమాండ్​ చేశారు. దీంతో ఆ ప్రాంతం అంతా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

DED Candidates Protest For Mega DSC
BED Candidates Darna in Hyderabad
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 4:30 PM IST

Updated : Aug 29, 2023, 4:47 PM IST

DSC Candidates Darna మెగా డీఎస్సీ కావాలని కోరుతూ నిరుద్యోగులు ధర్నా

DSC Candidates Protest for Mega DSC in Hyderabad : అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా 13600 ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లక్డీకాపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయాన్ని డీఎడ్‌, బీఎడ్‌(BED) అభ్యర్థులు ముట్టడికి యత్నించారు. వారితో పాటు బషీర్​బాగ్ కూడలిలో నుంచి రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. నిజాం కాలేజీ, రవీంద్రభారతి వైపు నుంచి ర్యాలీగా బయలుదేరిన సుమారు 400మంది అభ్యర్థులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగులు అసెంబ్లీ వైపు దూసుకెళ్లడానికి యత్నించారు.

BED Candidates Darna in Hyderabad : పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరుద్యోగులకు తీవ్ర తోపులాట, వాగ్వావాదం జరిగింది. అభ్యర్థులను పోలీసులు అడుగడున అడ్డగించి అరెస్టులు చేశారు. వీరందిరిని వేర్వేరు పోలీస్​ స్టేషన్లకు తరలించారు. కొంతమంది అభ్యర్థులు విద్యాశాఖ కార్యాలయం వద్దకు చేరుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వారిపై లాఠీలు ఝుళిపించారు.

న్యాయం చేయాలని కోరిన డీఎస్సీ 1998 అభ్యర్థులు

400 DED, BED Candidates Protest at Assembly in TS : కేవలం ఐదు టీచర్​ పోస్టులు భర్తీ చేసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని.. కృష్ణయ్య, నిరుద్యోగ ఐకాస చైర్మన్ నీలం వెంకటేష్ మండిపడ్డారు. ఎన్నికల కోసం నిరుద్యోగులను మోసం చేయాలని ముఖ్యమంత్రి చూస్తున్నారని.. తక్షణమే మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో టీచర్​ పోస్ట్​లు భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేయకపోతే అందోళన మరింత ఉద్ధృతం చేస్తామని అభ్యర్థులు హెచ్చరించారు. కేసీఆర్ డౌన్ డౌన్, సబితమ్మ ప్రకటన వద్దు.. కేసీఆర్​ ప్రకటనే కావాలని అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాలో పాల్గొన్న వారిలో ఇప్పటి వరకు 200మంది అభ్యర్థులను అరెస్టు చేసినట్లు సమాచారం. నిరుద్యోగులు ధర్నా చేయడం వల్ల అసెంబ్లీ పరిసరాల్లో ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలిగింది.

Telangana Dsc Notification 2023 : ఈ నెల 25న రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ను విడుదల చేసింది. 5089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అందులో 2575 ఎస్​జీటీలు, 1739 స్కూల్​ అసిస్టెంట్​, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో అసెంబ్లీలో సీఎం కేేసీఆర్​ 13600 ఉపాధ్యాయులు భర్తీ చేస్తారని.. త్వరలో మెగా డీఎస్సీ తీస్తారని చెప్పారని డీఎస్సీ అభ్యర్థులు తెలిపారు.

Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి

Telangana DSC Notification 2023 : 'రెండ్రోజుల్లో.. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్'

Komatireddy Venkat Reddy Letter to CM KCR : 'డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వకపోతే ప్రగతిభవన్‌ను ముట్టడిస్తాం'

Last Updated : Aug 29, 2023, 4:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.