ETV Bharat / state

ఆకట్టుకుంటోన్న డ్రైఫ్రూట్‌ క్రిస్మస్ కేక్‌ - తెలంగాణ తాజా వార్తలు

హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు షురూ అయ్యాయి. ఎర్రమంజిల్‌లో ఏర్పాటు చేసిన డ్రైఫ్రూట్ క్రిస్మస్ కేక్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ కేక్ మిక్సింగ్ కార్యక్రమంలో సినీ నటులు, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు సందడి చేశారు.

cake
cake
author img

By

Published : Dec 19, 2020, 8:06 PM IST

హైదరాబాద్‌లో క్రిస్మన్‌ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక క్రిస్మస్ కేక్‌ మిక్సింగ్ కార్యక్రమాలతో సందడిగా మారింది. హైదరాబాద్‌ ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం జరిగింది. సినీ నటులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులంతా కలిసి కేక్‌ మిక్సింగ్‌ చేస్తూ సందడి చేశారు.

dry-fruits-christmas-cake-at-erramanzil-in-hyderabad-district
ఆకట్టుకుంటోన్న డ్రైఫ్రూట్‌ క్రిస్మస్ కేక్‌

కేక్‌లో కాజు, పిస్తా, బాదం, డేట్స్‌, అంజీర్‌, ఫ్రూటీ, చెర్రీస్‌ ఇలా 16 రకాలైన డ్రైఫ్రూట్స్, 15 లీటర్ల ఆల్కహాల్‌ను మిక్సింగ్‌ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ రమేశ్ కుమార్‌ రెడ్డి తెలిపారు. 50 కేజీల డ్రైఫ్రూట్‌ తో దాదాపు 200 నుంచి 250 కేజీల కేక్‌లను తయారు చేసి వినియోగదారులకు అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ఈసారి 'రీజెన్సీ ద యాక్షన్ కంటిన్యూస్ ఆఫ్ న్యూ నార్మల్' అనే అంశంపై కేక్‌ మిక్సింగ్‌ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సంధ్యా జనక్‌, మాయ నెల్లూరితో పాటు కళాశాల ప్రిన్సిపల్‌ రమేశ్ కుమార్‌ రెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: పూలమొక్కల్లో గంజాయి- వ్యక్తి అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.