ETV Bharat / state

వ్యాయామం చేసే యువకులే లక్ష్యంగా డ్రగ్స్​ సరఫరా.. వేర్వేరు చోట్ల 8 మంది అరెస్టు - తెలంగాణలో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

Drugs supplyers gang arrest in telangana: ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్య మాదక ద్రవ్యాల వినియోగం. వీటి కట్టడికి పోలీసులు ఎంత ప్రయత్నించినా అక్రమార్కులు ఏదో ఒక రూపంలో సరఫరా చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి అధిక మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Mar 3, 2023, 9:33 PM IST

Drugs supplyers gang arrest in telangana: డబ్బు సంపాదనే లక్ష్యంగా యువకుల ప్రాణాలతో కొందరు చెలగాటమాడుతున్నారు. ఈ తరహాలోనే జిమ్‌లో వ్యాయామం చేసే వారిని లక్ష్యంగా చేసుకుని విచ్ఛలవిడిగా స్టెరాయిడ్లు విక్రయిస్తుండగా హైదరాబాద్‌ పోలీసులు ఈ ముఠా ఆటకట్టించారు. వీరిలో ఒకరు పరారీలో ఉండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టెరాయిడ్లు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు.

శరీరం ఫిట్‌గా ఉంటుందని స్టెరాయిడ్లు సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్ దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌, S.R.నగర్‌ పోలీసులు, ఔషధ నియంత్రణ శాఖ అదుపులోకి తీసుకుంది. జిమ్ముల్లో కసరత్తు చేస్తున్న యువతను లక్ష్యంగా చేసుకున్న ఈ ముఠా స్టెరాయిడ్లు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సనత్‌నగర్‌కు చెందిన ఓంప్రకాష్‌, అంబర్‌పేట్‌ వాసి నరేష్‌, సయ్యద్‌ ఫారూక్‌, అవినాష్‌ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వ్యాయామశాలలో శిక్షకుడిగా పనిచేస్తున్న ఓం ప్రకాశ్‌ ఎక్కువ సంపాదన కోసం స్టెరాయిడ్లు విక్రయించే దందాకు తెర తీశాడు. శరీరం ఫిట్‌గా ఉండేందుకు 250 M.G. డ్యూరాడెక్స్‌, స్ట్రాంబియర్‌, ఎయిర్‌స్లెన్‌, డెబోలాన్‌ వంటి స్టెరాయిడ్లను జిమ్ముల్లో కరసత్తు చేసే యువకులకు సరఫరా చేస్తున్నారు.

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు
డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

తక్కువ సమయంలో మంచి శరీరాకృతి వస్తుందని మాయమాటలు చెబుతూ... ఈ ముఠా స్టెరాయిడ్లను విక్రయిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఈ ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల నుంచి ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు పోలీసులకు పట్టుబడగా అవినాశ్‌ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. ఈ తరహా స్టెరాయిడ్లు వాడకంతో ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పోలీసులు తెలిపారు. వ్యాయామం చేసే వారు ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

హాష్ ఆయిల్ స్వాధీనం: హాష్ ఆయిల్ డ్రగ్ విక్రయించటానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ ఎస్.ఓ.టి బాలానగర్, కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశా మాల్కాన్గిరి జిల్లా కలిమెలకు చెందిన నారా పూజారి(34), మధు హంతల్ (57)లు కూలీ పని చేసుకొని జీవిస్తున్నారు. సులభంగా డబ్బులు సంపాదించటం కోసం హైదరాబాదులో డ్రగ్స్ విక్రయానికి ప్లాన్ చేశారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరుకు వెళ్లి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద హాష్ ఆయిల్ కొనుగోలు చేశారు. కూకట్‌పల్లి వై జంక్షన్ కు ఆటోలో చేరుకున్న వారు, హాష్ ఆయిల్ విక్రయానికి యత్నించారు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి 5గ్రాముల హాష్ ఆయిల్ కలిగిన 220 చిన్న కంటైనర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4,40,000 ఉంటుందని డీసీపీ తెలిపారు.

డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు
డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

గంజాయి సీజ్‌: మెదక్ జిల్లా నర్సాపూర్ సమీపంలో రుస్తుంపేట్ వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులని జిల్లా ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నర్సాపూర్‌ పట్టణానికి చెందిన సాయికుమార్, పురుషోత్తం, శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల బైక్ సీజ్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.