ETV Bharat / state

హైదరాబాద్​లో డ్రగ్స్ పట్టివేత - నైజీరియన్ నుంచి కొని ఇక్కడ అమ్మకాలు - drugs case in hyderabad

MDMA Drugs Seized by Secretariat Police : న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్​ విక్రయించడానికి మహారాష్ట్ర నుంచి హైదరాబాద్​కు సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

Rs.7 Lakhs Worth Drug Sized in Hyderabad
MDMA Drugs Seized by Secretariat Police
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 6:00 PM IST

Updated : Dec 28, 2023, 7:00 PM IST

MDMA Drugs Seized by Secretariat Police : హైదరాబాద్​లో మరో డ్రగ్స్​ ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. మహారాష్ట్ర నుంచి నగరానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠాను సచివాలయం ​ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ జోన్ డీసీపీ శరత్ పవార్(Central Zone DCP Sharat Pawar) తెలిపారు. వారి నుంచి రూ.7లక్షల విలువైన 100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​ను(MDMA Drugs) స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య

Rs.7 Lakhs Worth Drug Sized in Hyderabad : న్యూ ఇయర్​ వేడుకల్లో(New Year Events) విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చారని తెలిపారు. అక్కడ ఒక్క గ్రాము డ్రగ్​ని రూ.2వేలకు కొని హైదరాబాద్​లో రూ.7వేలకు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. నిందితులు మహారాష్ట్రలో ఒక నైజీరియన్ జ్యో నుంచి కొన్నట్టు ఒప్పుకున్నారని చెప్పారు. ప్రస్తుతం పరారీలో వున్న జ్యో కోసం గాలిస్తున్నామని తెలిపారు. డ్రగ్స్​ అమ్మేవారిపై, కొనేవారిపై పోలీసులు నిఘా ఎప్పుడూ ఉంటుందని డీసీపీ హెచ్చరించారు. డ్రగ్స్ విక్రయించేవారే కాకుండా వినియోగించే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు

"ముగ్గురు నిందితుల నుంచి 100గ్రాముల డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. దాని విలువ రూ.7లక్షలు. మహారాష్ట్రలో డ్రగ్స్​ కొని హైదరాబాద్​కు తీసుకువచ్చారు. రూ.2వేలకు అక్కడ కొంటారు. ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఒక్క గ్రాము రూ. 6వేల నుంచి రూ.7వేలకు అమ్ముతారు. వీరు జ్యో అనే నైజీరియన్ నుంచి డ్రగ్స్ కొన్నారు. వారి కోసం గాలిస్తున్నాము." - శరత్​ పవార్, సెంట్రల్ జోన్ డీసీపీ

110kgs Ganja Seized in Bhadradri : మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మీదుగా గంజాయి(Ganja) తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఖాళీగా ఉన్న బీరువాలు తరలిస్తున్నట్లు నమ్మించే విధంగా అమర్చి వాటి లోపల గంజాయి పెట్టి రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. నిందితుల నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. బీరువాలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు గంజాయిని గుర్తించి గ్యాస్ కట్టర్ల ద్వారా కత్తిరించి వాటిని బయటకు తీయాల్సి వచ్చింది.

భాగ్యనగరంలో డ్రగ్స్​ తయారీ ముఠా గుట్టురట్టు - ముగ్గురు నిందితుల అరెస్ట్

Last Updated : Dec 28, 2023, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.