Drugs Control And Cyber Crime New Bureau In Telangana : రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరించిపోతున్నాయి. నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది. ఎందుకంటే యువత అటువైపు అడుగులు వేయకుండా ప్రత్యేక జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేస్తోంది. అందుకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త విభాగాలను రాష్ట్ర హోం శాఖ ప్రారంభించింది.
దేశంలో మరేక్కడా లేని విధంగా నాలుగు వేల మందితో నార్కోటిక్స్, సైబర్ బ్యూరోలను ఏర్పాటు చేసింది. డ్రగ్స్ నివారణకు యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేయనున్నారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను నెలకొల్పనున్నారు. ఈ రెండు విభాగాలను రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభిస్తున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రెండు విభాగాలు ఏర్పాటు చేశారు. టవర్-బి లోని 13వ అంతస్తులో యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను.. టవర్-బిలోని 2,3 అంతస్తుల్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేశారు. నార్కోటిక్ బ్యూరో అదనపు డీజీగా సి.వి. ఆనంద్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్రను నియమించారు.
Cyber Crime Bureau In Telangana : రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలను పూర్తిగా నియంత్రణ చేయడానికి సమర్థవంతంగా కృషి చేస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. గోవా కేంద్రంగా కరుడుగట్టిన నేరస్థులను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన H New ద్వారా అరెస్ట్ చేశామని చెప్పారు. ఆఫ్రికన్ దేశానికి చెందిన కీలకమైన 12 మంది డ్రగ్స్ ముఠా సభ్యులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో పోలీస్ శాఖకు ధైర్యవంతులు, విజన్‌తో పని చేసే పోలీస్ సిబ్బంది అవసరమని వివరించారు.
నేరగాళ్లు డార్క్ నైట్ ద్వారా డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారన్నారు. నార్కోటిక్ విభాగానికి 300 ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. నార్కోటిక్ బ్యూరోలో డైరెక్టర్ బృందం కార్యాలయం నుంచి నాలుగు ప్రధాన పోలీస్ కమిషన్రేట్లు పనిచేస్తాయని సీపీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులను విచారించడానికి నాలుగు కోర్టులను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు కేంద్ర, స్థానికంగా ఉన్న దర్యాప్తు సంస్థలతో సమన్వయం చేసుకొని పని చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు.
Narcotics Bureau In Telangana : సైబర్ సెక్యూరిటీ బ్యూరో వల్ల ఆన్లైన్ మోసాలు అనేవి ఎక్కువగా జరగకుండా చూసుకుంటూ.. ఒకవేళ మోసాలు జరిగిన త్వరితగతిన కేసును ఛేదించడానికి ఉపయోగపడతాయి. దేశాన్ని కుదిపోసిన 67 కోట్ల మంది డేటా చోరీ కేసును పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అంతేకాదు ఆ సమాచారాన్ని చోరీ చేసిన సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు ఎంతో శ్రమించారు. అదే సైబర్ సెక్యూరిటీ బ్యూరోలు ఉంటే అంతర్రాష్ట్ర దొంగలను వేగంగా పట్టుకోవచ్చు. వారి సమాచారాన్ని ఆ రాష్ట్రాలకు వేగంగా చేరవేయవచ్చు. అదే కాకుండా ఇంకా సైబర్ నేరాలు ఎన్ని ఉన్నాయో వాటి అన్నింటికి ఈ బ్యూరో ఎంతో ఉపయోగపడుతోంది.
ఇవీ చదవండి :