మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు డిసోజాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. గోవా కేంద్రంగా డిసౌజా అలియాస్ స్టీవ్ డ్రగ్స్ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆగస్టు 16న కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేయగా.... నిందితుడిచ్చిన సమాచారంతో డిసోజాను పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ చక్రవర్తి తెలిపారు.
దేశ వ్యాప్తంగా 600 మంది డిసౌజా లిస్ట్‌లో ఉన్నారని... హిల్ టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్ డెన్ గుర్తించినట్లు చెప్పారు. డిసౌజా ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు... హైదరాబాద్‌కి చెందిన 168 మంది వినియోగదారులు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు.
గోవా కేంద్రంగా డిసౌజా అలియాస్ స్టీవ్‌ను అరెస్టు చేశాం. ఆగస్టు 16న బాబు అలియాస్ కాళీ అనే వ్యక్తిని అరెస్టు చేశాం. కాళీ ఇచ్చిన సమాచారంతో దర్యాప్తు చేశాం. దేశ వ్యాప్తంగా 600 మంది డిసౌజా లిస్ట్‌లో ఉన్నారు. గోవాలో డిసౌజా డ్రగ్స్ దందా చేస్తున్నాడు. హిల్ టాప్ రెస్టారెంట్‌లో డ్రగ్స్ డెన్ ఉంది. డ్రగ్స్‌ను డిసౌజా ఏజెంట్లు విక్రయిస్తుంటారు. హైదరాబాద్‌కి చెందిన 168 మంది వినియోగదారులు ఉన్నట్లు గుర్తించాం. న్యాయస్థానం అనుమతితో కస్టడీకి తీసుకొని దర్యాప్తు చేస్తాం. - పోలీసులు
ఇవీ చూడండి: