ETV Bharat / state

మదమెక్కిన డ్రైవర్​.. - HYDERABAD

సురక్షితంగా గమ్యం చేర్చాల్సిన డ్రైవరే... రాక్షసునిగా మారాడు. కన్నుమిన్ను కానక... కామంతో చిన్నపిల్లను ఇబ్బంది పెట్టాడు. ధైర్యం నేర్పాల్సిన ఉపాధ్యాయులు కనీసం చర్యలు తీసుకోకుండా బాధ్యత మరిచారు.

కన్నుమిన్ను కానక....!
author img

By

Published : Feb 22, 2019, 5:48 PM IST

హైదరాబాద్​ అల్వాల్​లోని సూర్యనగర్ భాష్యం విద్యాలయంలో ఒకటో తరగతి చదువుతున్న చిన్నారి పట్ల పాఠశాల బస్సు డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలకు వెళ్లేటప్పుడు , తీసుకొచ్చేటప్పుడు తాకరాని చోట చేతులు వేస్తున్నాడని విద్యార్థిని తన తల్లికి చెప్పగా... ప్రధానోపాధ్యాయురాలికి ఫిర్యాదు చేశారు.
రెండు నెలల కిందే చెప్పింది
రెండు నెలల కిందే బస్సు డ్రైవర్ సంతోష్​ గురించి చిన్నారి తరగతి ఉపాధ్యాయురాలికి చెప్పుకుంది. అయినా యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రధానోపాధ్యాయురాలిని తల్లిదండ్రులు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న మిగతా విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వైఖరి పట్ల ఆందోళనకు దిగారు.
చర్యలు తీసుకుంటాం
పాఠశాల యాజమాన్యం ఎట్టకేలకు స్పందించి బస్సు డ్రైవర్ సంతోష్​ను విధుల్లోంచి తొలగించింది. పాఠశాల వద్దకు చేరుకున్న పోలీసులు నిందితునిపై చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి:దేశంలోనే ప్రథమం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.