గణేష్ నిమజ్జనం వీక్షించడానికి వచ్చే భక్తులకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా నగరవ్యాప్తంగా 115 ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించాలని జలమండలి ఎండీ దాన కిశోర్ సూచించారు. ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సుమారుగా 30 లక్షల 52వేల మంచినీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. తెల్లవారుజామున 3గంటల నుంచి ఈ సేవలందించనున్నారని పేర్కొన్నారు. శోభాయాత్ర సాగే ప్రాంతాల్లో మంచినీటి పైపులైనులో లీకేజీలు, మ్యాన్ హోళ్లు సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచూడండి: కొత్త మంత్రివర్గంలో ఆరుగురికి ఛాన్స్.. ఇద్దరికి ఉద్వాసన...?