ETV Bharat / state

బాబోయ్‌ ఎండ.. తాగేసెయ్యండి కడుపు నిండ! - drink water to protect from dehydration in summer

ఎండలు మండిపోతున్నాయి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడంలేదు. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిన వేళ దాహాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా వడదెబ్బ తగలడం ఖాయమని జాతీయ పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు

drink water to protect from dehydration in summer
బాబోయ్‌ ఎండ.. తాగండి కడుపునిండా..!
author img

By

Published : May 26, 2020, 9:37 AM IST

మానవ శరీరంలో అధికభాగం నీరే..! ఇంజిన్‌ వేడెక్కకుండా నీరు ఎంత అవసరమో.. శరీరానికీ అంతే అవసరం. అలాగని ఎక్కువ చల్లటి నీరు తాగొద్దని హెచ్చరిస్తున్నారు. శీతాకాలం గోరువెచ్చటి నీటిని తాగాలంటున్నారు. మట్టికుండలోని నీరు దాహాన్ని తీర్చడమే కాకుండా.. శరీరాన్ని చల్లబెడుతుంది.

అసలు నీళ్లెందుకు తాగాలి..

మన శరీర బరువులో నీరు 60 శాతం ఉంటుంది. మలినాలను విసర్జించడంలో, శరీర ఉష్ణోగ్రతలను నిలకడగా ఉంచడంలోనూ నీరు ముఖ్యపాత్ర పోషిస్తుంది. చెమట, మలమూత్రాల రూపంలో శరీరం నీటిని నష్టపోతుంది. ఈ నష్టాన్ని ఎప్పటికప్పుడు శుభ్రమైన నీటిని తాగడం ద్వారా బర్తీ చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు సుమారు 2 నుంచి 3 లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. ఎండలు, చెమట రూపంలో నీటిని కోల్పోయినప్పుడు 4 నుంచి 5 లీటర్లు తాగాల్సి ఉంటుంది.

శరీరంలో 5 శాతం నీటిని కోల్పోయినా మనకు దాహం వేస్తుంది. అప్పుడు నీళ్లు తాగితే సరిపోతుందని ఎన్‌ఐఎన్‌ రిటైర్డ్‌ శాస్త్రవేత్త దమయంతి చెబుతున్నారు. తీసుకునే ఆహారంలో కూడా ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేటట్లు చూడాలంటున్నారు. ఎండాకాలం చెమట ద్వారా లవణాలను కోల్పోతాం కాబట్టి ఉప్పు కలిపిన మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు, దోసకాయలు, తర్బూజ తీసుకోవాలని సూచిస్తున్నారు.

సురక్షితమైన నీరు అంటే..

నీరు సురక్షితంగా.. ఆరోగ్యకరంగా ఉండాలంటే.. అందులో రోగకారక క్రిములు, బ్యాక్టీరియా, పరాన్న జీవులు, అంటువ్యాధులకు సంబంధించిన క్రిములు ఉండరాదు. అలాగే క్రిమినాశకాలు, పారిశ్రామిక వ్యర్థ పదార్థాలు, భారలోహాలు, నైట్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నా.. అది సురక్షితమైన నీరు కాదు. అలాగే మనం తాగే నీటిలో ఫ్లోరైడ్‌ శాతం ఎక్కువగా ఉన్నా.. ఎముకలలో దోషాలు, దంతాల సమస్యలు తలెత్తుతాయి. సాధారణంగా లీటరు నీటిలో 0.5 నుంచి 0.8 మిల్లీగ్రాముల ఫ్లోరైడు ఉంటే ఫర్వాలేదు.. అస్సలు లేకుండా ఉంటే మరీ మంచిది.

సురక్షితంగా చేయడం ఎలా..

నీరు సురక్షితమైంది కానప్పుడు దాన్ని 10-15 నిమిషాలపాటు మరిగించి, సంతృప్తికరంగా శుభ్రపరచాలి. అలా చేస్తే రోగకారక క్రిములన్నీ నాశనమై, తాత్కాలిక కఠినత్వం కూడా పోతుంది. కానీ మరగపెట్టడంతో రసాయనిక కలుషితాలు తొలగిపోవు. ఇరవై లీటర్ల నీటిని శుభ్రపరచడానికి 500 మిల్లీ గ్రాముల క్లోరిన్‌ మాత్రలు వాడాలి. నీటిని సురక్షితం, ఆరోగ్యకరంగా చేయడానికి ప్రస్తుతం ఎన్నో నీటిశుద్ధి యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. వీటితో సురక్షితమైన నీరు అందుబాటులోకి వస్తోంది కానీ లవణాలు కోల్పోతున్నాం. అలా అని ఆ భార జలాలు తాగేకంటే.. ఫిల్టర్‌ నీళ్లు తాగడమే మేలంటున్నారు వైద్యులు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.