ETV Bharat / state

వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు - floods in hyderabad

భారీ వర్షాలకు అతలాకుతలమైన హైదరాబాద్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు డీఆర్​ఎఫ్​ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. రోడ్లపై నిలిచిన చెత్త, చెదారాన్ని తొలిగిస్తున్న జీహెచ్​ఎంసీ సిబ్బంది... వ్యాధులు ప్రబలకుండా శానిటైజ్‌ చేస్తున్నారు.

drf teams relief activities in flood affected areas in hyderabad
వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
author img

By

Published : Oct 21, 2020, 10:38 PM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

కుంభవృష్టి వల్ల హైదరాబాద్‌లో చాలా ప్రాంతాలు ముంపునకు గురవ్వగా... అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నగరవ్యాప్తంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో మెుత్తం 19 డీఆర్​ఎఫ్​ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కష్టాల్లో ఉన్నామని ఫోన్‌ చేసిన బాధితులకు వెంటనే సహాయం అందిస్తున్నాయి. రహదారులపై కూలిపోయిన చెట్ల తొలగింపు... నీటిని మళ్లించే పనులే కాకుండా ఆపదలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నామని డీఆర్​ఎఫ్​ టీమ్ సభ్యులు తెలిపారు. న్యూనాగోల్​లో రహదారులకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను కత్తిరించిన సహాయ బృందాలు.. స్థానికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు.

నీటిని మళ్లించేందుకు చర్యలు

సరూర్ నగర్​లోని సరస్వతి నగర్ , సింగరేణి కాలనీలో రహదారిపై నిలిచిన బురదను... జేసీబీ సహయంతో జీహెచ్​ఎంసీ సిబ్బంది తొలగించారు. నీటిని మళ్లించేందుకు చర్యలు చేపట్టారు. లాలాపేటలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా రహదారిపై నిలిచిన చెత్త, చెదారాన్ని తీసివేశారు. ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్‌, రసాయనాలు పిచికారీ చేశారు. మరోవైపు నగరంలో వివిధ చోట్ల శిథిలావస్థకు చేరిన పురాతన భవనాలను జీహెచ్​ఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు నేలమట్టం చేస్తున్నారు. అందులో భాగంగా బేగంబజార్‌లో ఓ పురాతన భవనాన్ని జేసీబీతో కూల్చేశారు.

వరద ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు వచ్చే వరకు సహాయక చర్యలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ఉత్తమ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.