హైదరాబాద్ బేగంపేట ప్లాజా హోటల్లో జాతీయ నియోనాటాలజీ స్టేట్ ఫోరం తెలంగాణ రాష్ట్ర ఛాప్టర్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. నూతన అధ్యక్షులుగా నియమితులైన డాక్టర్ విజయ్ కుమార్ రాబోయే రెండేళ్లకు సంబంధించిన ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు, సెక్రెటరీలను సన్మానించి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలో అప్పుడే పుట్టిన శిశువులకు, బరువు తక్కువ ఉన్న శిశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్ విజయ్ కుమార్ సూచనలు చేశారు. తల్లి పాల ఆవశ్యకత, శిశువుల పౌష్టికాహార విషయంలో జిల్లాలోని వైద్యులకు, నర్సులకు తమ బృందం తరఫున శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. శిశు మరణాల రేటు తగ్గించే ప్రధాన లక్ష్యంతో వారిలో పౌష్టికత్వాన్ని పెంచేందుకే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు, శిశుమరణాలను తగ్గించి శిశు జనాల పెంపుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి కార్యక్రమాలపై రానున్న రెండేళ్లలో ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్టు వెల్లడించారు. బిడ్డ జన్మించే ముందే తల్లికి ఇంజక్షన్లు చేయడం వల్ల శిశువు ఆరోగ్యకరంగా ఉంటారని సెక్రటరీ రమేశ్ తెలిపారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: ఆతిథ్యం సరే.. మరి ఒప్పందాల మాటేంటి?