Thalassemia: తలసేమియాను ఎలా గుర్తిస్తారు? - Telangana news
Dr RV Rao on Thalassemia: తలసేమియా కట్టడికి మార్గమే లేదా..? బాధితులను గుర్తించటంలో ఎలాంటి విధానాలు అనుసరించాలి? ఈ ప్రశ్నలకూ సమాధానమిస్తున్నారు... జీనోమ్ ఫౌండేషన్ సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ డాక్టర్ వీఆర్ రావు. గర్భిణులను స్క్రీనింగ్ చేయటం ద్వారా ఈ వ్యాధిని చాలా వరకు కట్టడి చేయవచ్చన్నది ఆయన అభిప్రాయం. పుట్టబోయే బిడ్డకూ తలసేమియా సోకే ప్రమాదం ఉందని నిర్ధరణ అయితే... చట్టపరంగానే అబార్షన్ చేయించుకోవచ్చని అంటున్నారు. గ్రామ గ్రామాల్లో అవగాహన కల్పించటమూ ముఖ్యమేనని సూచిస్తున్నారు. పిల్లలను కాపాడుకునేందుకు పెట్టే ఖర్చుని... వ్యాధి కట్టడికి మళ్లించటం ద్వారా కొంత మేర విజయం సాధించవచ్చని వివరిస్తున్నారు. తలసేమియా బాధితులను గుర్తించేందుకు వీలుగా మొబైల్ యాప్‌నూ తయారు చేస్తున్నామని అంటున్నారు... డాక్టర్ వీఆర్ రావు.
Thalassemia
Last Updated : Feb 8, 2022, 2:09 PM IST