వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఐదు కోట్ల విరాళాన్ని అందించింది. అక్టోబర్లో కురిసిన అధిక వర్షాలకు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఆస్తి, ప్రాణ నష్టం తమను బాధించిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ పేర్కొంది.
అధిక వర్షాలతో అతలాకుతలమైన కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం పూనుకున్న నేపథ్యంలో.. ఈ సంకల్పంలో చేయూతనిచ్చేందుకు తమవంతు విరాళాన్ని అందజేస్తున్నామని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో డాక్టర్ రెడ్డీస్ లాబోరేటరీస్ పేర్కొంది. ఐదుకోట్ల రూపావయల విరాళానికి సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్కు అందజేసింది.