ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల లాంజ్‌లో డాక్టర్ కరాటే రాజు నాయక్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీందర్ నాయక్ సంతాపసభ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా హాజరైన ఐఆర్ఎస్ జీవన్‌లాల్, సోషల్ వెల్ఫేర్ జేడీ హన్మంతు నాయక్‌తోపాటు పలువురు ప్రముఖులు రవీందర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళుల్పరించారు.
గొప్ప విద్యావంతున్ని కోల్పోయమని కరాటే రాజునాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. రవీందర్ నాయక్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. రవీందర్ నాయక్ కుటుంబ సభ్యులకు... ఎన్ఆర్ఐ గోర్ ఫౌండేషన్, గ్లోబల్ బంజారా, గోర్ హెల్పింగ్ హాండ్స్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్, తెగ, లైవ్, ఓయూ ప్రొఫెసర్, ఉద్యోగులు అందరూ కలిపి, 5లక్షల 40 వేల రూపాయాలను అందించారు. కార్యక్రమంలో ప్రకాష్ రాఠోడ్, శ్యామ్ నాయక్, సురేష్ నాయక్, రామచందర్ నాయక్, డాక్టర్ రాజ్ కుమార్, సూర్యం నాయక్, ప్రొఫెసర్ చంద్రుడు, అమర్సింగ్, విద్యార్థి నాయకులు నెహ్రూ నాయక్, సంపత్ నాయక్, సుబ్బు నాయక్, రమేష్ రాఠోడ్, లింగ నాయక్, డాక్టర్ రవి, తదితరులు పాల్గొన్నారు.