ETV Bharat / state

'ఈనాటికీ రిజర్వేషన్ల కోసం పోరాటం.. దురదృష్టకరం' - ambedkar jayanti at tankbund

అణగారిన వర్గాల కోసం పోరాడిన మహనీయుడు డా. బీఆర్​ అంబేడ్కర్​ అని మంత్రి ఈటల రాజేందర్​ పేర్కొన్నారు. అంబేడ్కర్​ జయంతి సందర్భంగా హైదరాబాద్​ ట్యాంక్​బండ్​లోని ఆయన​ విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.

AMBEDKAR JAYANTHI
EETELA
author img

By

Published : Apr 14, 2021, 1:15 PM IST

కుల, మత భేద రహిత సమాజమే బాబాసాహెబ్‌ అంబేడ్కర్ లక్ష్యమని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అణగారిన వర్గాలు, అణచివేతకు గురైన వారి కోసం అంబేడ్కర్​ పోరాడారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా హైదరాబాద్​ ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహానికి ఈటల పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈనాటికీ రిజర్వేషన్‌ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరమని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ కొందరు దళితులు దుర్భర జీవితం గడుపుతున్నారని తెలిపారు. పాలకులు రాజ్యాంగాన్ని పఠనం చేసి ప్రజలకు మేలు చేయాలన్నారు.

ఇదీ చదవండి: అంబేడ్కర్​కు సంబంధించిన స్థలాలను పంచ తీర్థాలుగా చేశాం: కిషన్​ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.