ETV Bharat / state

2021కల్లా.. ఏపీకి రెండు సరకు రవాణా నడవాలు

author img

By

Published : Dec 27, 2020, 12:30 PM IST

దేశంలో సరుకు రవాణా ద్వారా ఆదాయం పెంచుకోవటంతో పాటు.. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేలా వచ్చే ఏడాదికి కార్యాచరణను రూపొందించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మూడు డెడికేటెడ్ ఫ్రైట్‌ కారిడార్లు, ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ సిద్ధమైనట్లు బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్ స్పష్టం చేశారు.

dprs-of-three-dedicated-freight-corridors-and-seven-high-speed-rail-corridors-will-be-prepared-soon
2021కల్లా.. ఏపీకి రెండు డెడికేటెట్‌ ఫ్రైట్‌ కారిడార్లు

వచ్చే ఏడాది డిసెంబరుకల్లా దేశంలో సరకు రవాణాకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతతో మూడు డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్లు, ప్రయాణికుల పరంగా ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల డీపీఆర్‌లు సిద్ధం చేయనున్నట్లు రైల్వే శాఖ స్పష్టం చేసింది. శనివారం దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్ మాట్లాడుతూ.. రైల్వేశాఖ 2020లో సాధించిన విజయాలను, 2021లో చేపట్టబోయే కార్యాచరణను వివరించారు.

డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్ల(సరకు రవాణా నడవాలు)లో ఖరగ్‌పుర్‌ - విజయవాడల మధ్య ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌, విజయవాడ - ఇటార్సీ మధ్య నార్త్‌ సౌత్‌ సబ్‌కారిడార్‌ ఉన్నట్లు వినోద్ వెల్లడించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌) తయారుచేయబోయే ఏడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లలో ముంబయి - పుణె - హైదరాబాద్‌ మార్గం ఉన్నట్లు తెలిపారు. డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌కు సంబంధించి ప్రాథమిక నివేదిక సిద్ధమైందన్నారు. ఒకసారి డీపీఆర్‌ పూర్తైతే.. ఈ మార్గాల ద్వారా లభించే ఆదాయం(రేట్‌ ఆఫ్‌ రిటర్న్‌)పై స్పష్టత వస్తుందన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. ఈ నడవాలలో 25 శాతం వరకు ఆదాయం వచ్చే అవకాశాలున్నట్లు తేలిందని ఆయన‌ పేర్కొన్నారు. దీనికితోడు ఏడు మార్గాల్లో సెమీ హైస్పీడ్‌, హైస్పీడ్‌ రైళ్ల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. డిసెంబర్‌ నాటికి డీపీఆర్‌ పూర్తయ్యాక.. అందులో ఒక్కో సెక్షన్‌ను పూర్తిగా విశ్లేషించి ఎక్కడ ఏ కారిడార్‌ చేపట్టాలో నిర్ణయిస్తామన్నారు. నేషనల్‌ రైల్‌ ప్లాన్‌పై ప్రజాభిప్రాయాన్ని సేకరించిన అనంతరం వచ్చే జనవరి నాటికి దాన్ని ఖరారుచేస్తామన్నారు.

త్వరలోనే వందే భారత్‌ రైళ్ల టెండర్ల ఖరారు..
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించి టెండర్లు తెరిచామని, జనవరిలో వాటిని ఖరారుచేసి మూడు కోచ్‌ ఫ్యాక్టరీల్లో ఆ రైళ్లను తయారుచేయాలని నిర్ణయించినట్లు వినోద్‌‌ పేర్కొన్నారు. దేశంలో హైపర్‌లూప్‌, మ్యాగ్నెటివ్‌ లెవిటేషన్‌ సాంకేతికత వినియోగంపై నీతి ఆయోగ్‌ అధ్యయనం చేస్తోందన్నారు. రాబోయే హైస్పీడ్‌ కారిడార్లలో ఏ దేశ సాంకేతికత అవలంబించేదీ డీపీఆర్‌ పూర్తయ్యాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ముంబయి-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌(బుల్లెట్‌) రైలు మార్గంలో ఇప్పటివరకు 68% భూసేకరణ పూర్తైందన్నారు. గుజరాత్‌ పరిధిలో ప్రక్రియ కొలిక్కి వచ్చినందున అక్కడ 325 కిమీ. కు సంబంధించిన రూ.32వేల కోట్ల విలువైన సివిల్‌ కాంట్రాక్ట్‌లను ఖరారుచేసినట్లు ఆయన‌ వివరించారు. మహారాష్ట్ర సర్కారు వచ్చే నాలుగు నెలల్లో భూసేకరణను పూర్తిచేయనున్నట్లు స్పష్టీకరించిందని పేర్కొన్నారు.

2021కల్లా డీపీఆర్‌ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ఫ్రైట్‌ కారిడార్లు
1. ఈస్ట్‌కోస్ట్‌ కారిడార్‌- ఖరగ్‌పుర్‌- విజయవాడ- 1,115 కి.మీ.
2. ఈస్ట్‌ వెస్ట్‌ సబ్‌కారిడార్‌- భుసావల్‌-నాగ్‌పుర్‌-ఖరగ్‌పుర్‌-ఢంకుని- 1,673 కి.మీ.
3. నార్త్‌ సౌత్‌ సబ్‌కారిడార్‌- విజయవాడ-ఇటార్సీ- 975 కి.మీ

  • ఈ ప్రాజెక్టులను రైల్వే శాఖ.. పీపీపీ/హైబ్రిడ్‌ యాన్యుటీ/వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ పద్ధతుల్లో చేపట్టనుంది.

2021 చివరికి డీపీఆర్‌ పూర్తిచేయాలని తలపెట్టిన హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు
1. దిల్లీ-ఆగ్రా-వారణాశి- 865 కి.మీ.
2. వారణాశి-పట్నా-హావ్‌డా- 760 కి.మీ.
3. దిల్లీ-జైపుర్‌-అహ్మదాబాద్‌- 886 కి.మీ
4. దిల్లీ-చండీగఢ్‌-అమృత్‌సర్‌- 459 కి.మీ.
5. ముంబయి-నాసిక్‌-నాగ్‌పుర్‌- 753 కి.మీ.
6. ముంబయి-పుణె-హైదరాబాద్‌- 771 కి.మీ.
7. చెన్నై-బెంగళూరు-మైసూరు- 435 కి.మీ.

  • ఈ ప్రాజెక్టులకు రైల్వే భూసేకరణ చేపడుతుంది. పీపీపీ విధానంలో ఆర్థిక వనరులు సమకూరుస్తుంది.

రైల్వేశాఖ నిర్దేశించుకున్న మరికొన్ని లక్ష్యాలు

  • దిల్లీ-చెన్నై మార్గంతో పాటు, స్వర్ణ చతుర్భుజి విభాగంలో రైళ్ల వేగం 2021 డిసెంబర్‌ కల్లా 130 కిమీ.కు పెంపు.
  • విశాఖ రేవుతో రాయ్‌పుర్‌-టిట్లాగఢ్‌ మా ర్గాన్ని అనుసంధించే ప్రాజెక్టు 2021కల్లా పూర్తి.

ఇదీ చదవండి: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.